త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Forensic Lab | అనుమాన‌మే నిజ‌మైంది.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్ర‌మాదంలో కాలిబూడిదైన కీలక ఫైళ్లు, ఆధారాలు!

Forensic Lab | అనుమాన‌మే నిజ‌మైంది. ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబోరేటరీ (Forensic Lab) అగ్ని ప్రమాదంలో దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీల‌కమైన సాక్ష్యాలు, ప‌త్రాలు, హార్డ్ డిస్కులు ఆధారాలు బుగ్గి పాలయ్యాయి.

G

Telangana | Published On Feb 8, 2026, 12.41 pm IST

Forensic Lab | అనుమాన‌మే నిజ‌మైంది.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్ర‌మాదంలో కాలిబూడిదైన కీలక ఫైళ్లు, ఆధారాలు!
Advertisement

Forensic Lab | త్రినేత్ర‌.న్యూస్‌: అనుమాన‌మే నిజ‌మైంది. ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబోరేటరీ (Forensic Lab) అగ్ని ప్రమాదంలో దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీల‌కమైన సాక్ష్యాలు, ప‌త్రాలు, హార్డ్ డిస్కులు, ఆధారాలు బుగ్గి పాలయ్యాయి. మొత్తం ఐదు గ‌దుల్లో ఉన్న కీలక ఫైల్స్ (Key files) కాలిపోయినట్లు తెలిసింది.

నాంప‌ల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీలో (FSL) శనివారం ఉద‌యం 10.35 గంటల‌ స‌మ‌యంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌న‌ప్ప‌టికీ, పెద్దఎత్తున ఆస్తిన‌ష్టం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌పై నాంప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోద‌యింది. ఎఫ్ఎస్ఎల్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారు. అగ్నిప్రమాదంలో మొత్తం ఐదు గ‌దుల‌లో కీలక ఫైళ్లు తగులబడిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిలో సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్ ఉన్నాయి. కాగా, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదంటూ నిన్న రాత్రి పోలీసులు ఒక నోట్ విడుదల చేయడం గమనార్హం.

బీఆర్ఎస్ నేత‌ల ఆరోప‌ణ‌ల‌కు బ‌లం..

అయితే ఎఫ్ఎస్ఎల్ పోలీసుల ఫిర్యాదుతో బీఆర్ఎస్ (BRS) నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో వాయిస్ రికార్డింగ్‌లు తొల‌గించ‌డంపోఆటు, ఫోన్ ట్యాంపింగ్ వంటి క‌ల్పిత రాజ‌కీయ కేసుల్లో సాక్ష్యాధారాల కొర‌త‌ను క‌ప్పిపుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్ర‌మాదంతో ఏ కేసులో ఆధార‌లు చెరిపేందుకు మీరు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నిస్తూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.

కాగా, ప్ర‌మాదం జ‌రిగిన గ‌దుల్లోనే ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవ‌ల ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా కాలి బూడిదైన‌ట్లు ప్ర‌చారం జ‌రుతున్న‌ది. దీంతోపాటు చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే ట్రాక్‌పై ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజ‌య‌శాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్‌, ల్యాప్‌టాప్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం

ఎమ్మెల్యే కొ నుగోలు కేసు ఆధారాలూ అక్కడే..!

తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సబంధించిన కీలక సాక్ష్యాధారాలన్నీ అక్కడే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలుపొందేందుకు ఓ నామినేటెడ్‌ ఎమ్మెల్యే కొ నుగోలుకు సంబంధించి ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆధారాలు, వాయిస్‌ రికార్డింగ్‌లు ఆ గదిలోనే ఉన్నట్టు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి వాయిస్‌ టెస్టింగ్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్టు కూడా అక్కడే ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫైళ్లు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తున్నది. ఓటు కు నోటు కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు వి చారణ దగ్గర పడుతున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం జరగడం సంచలనంగా మారింది.

Advertisement
Advertisement