Revanth Reddy | సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. ఏసీబీ కోర్టు షరతులు
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు (ACB Court) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రూ.లక్ష ష్యూరిటీ సమర్పించడంతోపాటు విదేశాల్లో (Foreign tour) ఉండే చిరునామా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు (ACB Court) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రూ.లక్ష ష్యూరిటీ సమర్పించడంతోపాటు విదేశాల్లో (Foreign tour) ఉండే చిరునామా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 18లోగా పాస్ పోర్టు తిరిగి అప్పగించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, యూఎస్, జర్మనీ, చైనాలో పర్యటించనున్నారు. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసులో (Cash for Vote case) ప్రధాన నిందితుడిగా ఉండటంతో.. బెయిల్ షరతుల మేరకు ఆయన పాస్‌పోర్టు కోర్టు కస్టడీలో ఉంది. ఈ నేపథ్యంలో పర్యటనకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఓటుకు నోటు కేసులు జప్తు చేసిన పాస్‌పోర్టు (Passport) ఇవ్వాలని కోరారు. బెయిల్ షరతులను సడలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
సీఎం పర్యటన ఇలా..
సీఎం రేవంత్ ఈనెల 17 నుంచి సెప్టెంబరు 10 మధ్య యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం బృందం పర్యటించనుంది. నాలుగు దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులతోపాటు రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, క్రీడలు, శిక్షణా సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి ముందుగా యూకేకు, అక్కడ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు నిఖా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహా్వనించే ప్రయత్నాలు జరగనున్నాయి. యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలను సందర్శించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. కాగా, ఈనెల 16న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి 21ఏండ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలంటూ తీర్మానం చేసే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీకి..
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భూపేందర్‌సింగ్, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
ఆగస్టు 13, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..



