Seedance 2.0 | సినిమా రంగంపై సీడాన్స్ పిడుగు..!
Seedance 2.0 | చైనాకు చెందిన టెక్‌దిగ్గజం బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియో మోడల్‌ప్రపంచ సినిమా రంగాన్నే కుదిపేస్తోంది. ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించి రూపొందించిన వీడియోలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
Entertainment | Published On Feb 27, 2026, 8.06 pm IST
Seedance 2.0 | చైనాకు చెందిన టెక్‌దిగ్గజం బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియో మోడల్‌ప్రపంచ సినిమా రంగాన్నే కుదిపేస్తోంది. ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించి రూపొందించిన వీడియోలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒక్క ప్రాంప్ట్‌తో కళ్లు చదిరేలా విజువల్స్‌తయారు చేస్తున్నది. దీంతో సాంకేతిక రంగంతో పాటు సృజనాత్మక రంగాల భవిష్యత్‌ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టిక్‌టాక్‌మాతృసంస్థ తీసుకువచ్చిన సీడాన్స్ 2.0 (Seedance 2.0) ప్రధాన కారణంగా నిలిచింది. ఈ టూల్‌తో ప్రాంప్ట్‌లు ఇస్తే హాలీవుడ్ రేంజ్‌లో సినిమా విజువల్స్‌ను తయారు చేసే సత్తా దీనికి ఉంది. అద్భుతమైన విజువల్స్‌తో పాటు సౌండ్ డిజైన్‌ను సమన్వయం చేయగలగడం దీని ప్రత్యేకత.
హాలీవుడ్‌స్టూడియోల ఆగ్రహం..
సీడాన్స్‌తో రూపొందించినట్లుగా స్పైడర్‌మ్యాన్, డెడ్‌పూల్‌వంటి పాత్రలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌అయ్యాయి. ఈ క్రమంలో హాలీవుడ్‌దిగ్గజ సంస్థలైన డిస్న (Disney), పారామౌంట్‌పిక్చర్స్ (Paramount Pictures) స్పందించాయి. కాపీరైట్‌ఆరోపణలు చేస్తూ బైట్‌డాన్స్‌కు సీజ్‌అండ్‌డిసిస్ట్‌పేరిట నోటీసులు జారీ చేశాయి. జపాన్‌లోనూ ప్రముఖ యానిమేటెడ్‌పాత్రలతో రూపొందించిన ఏఐ వీడియోలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే, బైట్‌డాన్స్‌మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించింది.
సీడాన్స్ అంటే ఏమిటి?
సీడాన్స్ తొలి వెర్షన్‌గతేడాది జూన్‌లో విడుదలైంది. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా వచ్చిన సీడాన్స్2.0 వెర్షన్‌మాత్రం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తన వైపు ఆకర్షించింది. క్రియేటివ్ స్టూడియో వీడియో స్టేట్‌కు చెందిన జాన్ విల్లెమ్ బ్లామ్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు చూసిన ఏఐ వీడియోలు బాగానే ఉన్నాయి. కానీ, ఇది నేరుగా అసలు సినిమా నిర్మాణంలో ఉన్నట్లుగానే హైక్వాలిటీతో ఉన్నాయి’ అని తెలిపారు. ఇప్పటి వరకు పలు మోడల్స్‌యూజర్లు ఇచ్చే సూచనల మేరకు ఫొటోలను తయారు చేసి ఇస్తున్నాయి. అయితే, సీడాన్స్ టెక్స్ట్‌తో పాటు విజువల్స్, ఆడియోను ఒకే వేదికపై సమగ్రంగా సమన్వయం చేయడం విశేషమని నిపుణులు చెబుతున్నారు.

ఒక్క ప్రాంప్ట్‌తోనే..
మిడ్‌జర్నీ, సోరా వంటి టూల్స్‌సరసన నిలిచే స్థాయిలో ఈ టూల్‌ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఒకే ప్రాంప్ట్‌తో అత్యుత్తమ నాణ్యత కలిగిన వీడియోలు తయారు చేస్తోంది. సీడాన్స్‌లో రూపొందించబడినట్లు చెబుతున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నటుడు విల్‌స్మిత్‌స్పాగెట్టి (ఇటాలియన్‌వంటకం) తింటున్న వీడియోలతో పాటు పలు భారీ బడ్జెట్‌యాక్షన్‌సీన్స్‌తరహాలో వీడియోలు సైతం వైరల్‌అయ్యాయి. సింగపూర్‌కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘టైనీ ఐలాండ్ ప్రొడక్షన్స్’ అధినేత డేవిడ్ క్వాక్ మాట్లాడుతూ ‘ఇది యాక్షన్ సీన్స్‌వాస్తవంగా తెరకెక్కించినట్లుగా ఉన్నాయని, యాక్షన్ సినిమాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సినిమాటోగ్రాఫర్ తోడుగా ఉన్నట్టే అనిపిస్తోందని’ వ్యాఖ్యానించారు.
ఎన్నో సవాళ్లు..
సీడాన్స్ కాపీరైట్‌వివాదాల్లో చిక్కుకుంది. అనుమతి లేకుండా కాపీరైట్‌పాత్రలను వినియోగించడంతో క్రియేటివ్‌రంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్టూడియోలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ మేధో సంపత్తిని అనధికారికంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నాయి. సాంకేతిక పురోగతికి నైతిక బాధ్యత సైతం జోడించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే భవిష్యత్తులో సృజనాత్మక రంగాలు, టెక్నాలజీ సంస్థల మధ్య వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే తరహా ఆరోపణలు గతంలో ఇతర ఏఐ సంస్థలపైనా వచ్చాయి. 2023లో ది న్యూయార్క్ టైమ్స్‌తన వ్యాసాలను అనుమతి లేకుండా వాడుకున్నారని ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై కేసు వేసింది. గతేడాది రెడ్డిట్‌సైతం ఇలాంటి కారణాలతో న్యాయపోరాటం ప్రారంభించింది. గూగుల్‌పై డిస్నీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
చిన్న సంస్థలకు కొత్త దారులు..
అయితే, చిన్న నిర్మాణ సంస్థలకు సీడాన్స్ వంటి టూల్స్‌కొత్త ద్వారాలను తెరుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో రూపొందించే షార్ట్‌వీడియోలు, మైక్రో డ్రామాలు సాధారణంగా ప్రేమకథలు, కుటుంబ కథలకే పరిమితమవుతుంటాయి. ఇందుకు ప్రధాన కారణంగా విజువల్‌ఎఫెక్ట్స్‌ఖర్చులు అధికంగా ఉండడం. తాజాగా ఏఐ సహాయంతో సైన్స్‌ఫిక్షన్, పీరియడ్‌డ్రామా, యాక్షన్‌వంటి విభిన్న జానర్లలోనూ ప్రయోగాలు చేయొచ్చని డేవిడ్‌క్వాక్‌అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరణ శాసనమన్న రామ్‌గోపాల్‌వర్మ
ఈ ఏఐ టూల్‌పై టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. సీడాన్స్ 2.0 ఏఐ టూల్స్ కారణంగా సినిమా ఎకోసిస్టమ్ పూర్తిగా మారిపోతుందని అన్నారు. వందల కోట్ల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో నడిచే ప్రస్తుత చిత్ర పరిశ్రమ ఇక చరిత్రగా మిగిలిపోవచ్చని వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్‌చిత్రాలు తెరకెక్కిస్తూ రాజమౌళి నెంబర్‌వన్‌దర్శకుడిగా ఉన్నారని, ఆయనకున్న అసమానమైన సృజనాత్మక ఊహాశక్తితో వేల కోట్ల రూపాయలు రాబట్టడం సాధ్యమవుతోందన్నారు. 120 కోట్లకుపైగా జనాభా ఉన్న భారత్‌లో ఎంతో మంది ఊహాశక్తి గలవారు ఉన్నప్పటికీ పరిశ్రమలోకి వచ్చే అవకాశం గానీ, పెట్టుబడి పెట్టే స్తోమత గానీ లేదన్నారు. అలాంటి వారికి సీడాన్స్‌ద్వారాలు తెరిచిందన్నారు. ఇకపై భారీ బడ్జెట్లు, దీర్ఘకాలిక షూటింగులు అవసరం లేకుండానే థియేట్రికల్‌క్వాలిటీ సినిమాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. నటీనటుల డేట్స్, మూడ్స్‌తో సంబంధం లేకుండా కేవలం వివరణాత్మక ప్రాంప్ట్‌ఇస్తే సినిమా విజువల్స్, సౌండ్‌డిజైన్‌తో కూడిన సన్నివేశాలు నిమిషాల్లోనే సిద్ధమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంథ్రోపిక్‌తో ఐటీరంగం కుదేలు..
అంథ్రోపిక్‌వంటి ఏఐ సంస్థల అభివృద్ధితో ఐటీ రంగం ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అధునాతన ఏఐ మోడళ్ల రాకతో సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌సేవల అవసరం తగ్గుతుందన్న ఆందోళనల నేపథ్యంలో టెక్‌కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నష్టపోతున్నాయి. ఆటోమేషన్‌పెరుగుదలతో ఉద్యోగాల భద్రత, ఖర్చుల పునర్వ్యవస్థీకరణ, పెట్టుబడుల మార్పు తదితర అంశాలు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో సీడాన్స్2.0 వంటి వీడియో జనరేటివ్‌ఏఐ టూల్స్‌సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం డిస్క్రిప్టివ్‌ప్రాంప్ట్‌లతోనే విజువల్స్, సౌండ్‌తో కూడిన సన్నివేశాలను సృష్టించే ఏఐ టెక్నాలజీ కారణంగా ఇండస్ట్రీపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సినిమాల్లో నటీనటులు, ఇతర పాత్ర కీలకంగానే ఉంటుందని.. అయితే, నిర్మాణ పద్ధతులు, బడ్జెట్, టెక్నాలజీ వినియోగంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also :
జాన్వీ కపూర్‌ని కరణ్ జోహార్ అంతమాటన్నాడా..?
దళపతి విజయ్‌కి షాక్ - విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భార్య - హీరోయిన్ కారణంగా చిచ్చు
ప్రభాస్ స్పిరిట్‌లో లేడీ విలన్ - ఎవరీ ఐశ్వర్య దేశాయ్?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






