Janhvi Kapoor | జాన్వీ కపూర్‌ని కరణ్ జోహార్ అంతమాటన్నాడా..?
Janhvi Kapoor | ఫిల్మ్ ఇండస్ట్రీలో తారల కెరీర్‌లను పర్యవేక్షించే బాధ్యతను స్పెషల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు చూసుకుంటున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్‌ను ధర్మా కర్నర్ స్టోన్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ చూసుకునేది.
Entertainment | Published On Feb 27, 2026, 7.53 pm IST
Janhvi Kapoor | ఫిల్మ్ ఇండస్ట్రీలో తారల కెరీర్‌లను పర్యవేక్షించే బాధ్యతను స్పెషల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు చూసుకుంటున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్‌ను ధర్మా కర్నర్ స్టోన్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ చూసుకునేది. అయితే, ఆ ఏజెన్సీ నుంచి బయటకు వచ్చిందని వార్తలు వచ్చాయి. మరో ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ పలువురు ఏజెన్సీలను మార్చుకున్నారు. ఈ క్రమంలోనే దర్శక-నిర్మాత కరణ్ జోహర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఈ బిజినెస్‌లో నిబద్ధత అనే భావన ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల సార్థక్ ఆహుజాతో నిర్వహించిన యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో కరణ్ జోహర్ టాలెంట్ మేనేజ్‌మెంట్ రంగంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ బాధ్యత కృతజ్ఞతలు ఆశించలేని పనిగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నటీనటులు ఏజెన్సీలు మారడం ఈ రంగంలో సాధారణమైపోయిందన్నారు. రెండేళ్ల పాటు ఒక హీరోయిన్ కోసం సమయం, శ్రమ, వనరులు వెచ్చించిన తర్వాత మరో సంస్థకు వెళ్లిపోవడం సాధారణమన్నారు. అక్కడ సంతృప్తి లేకపోతే మళ్లీ తిరిగి వస్తారన్నారు.
ఇది ఓ సైకిల్‌లా మారిందని వ్యాఖ్యానించారు. తమ కెరీర్‌కు గడువు ఉందనే భావనతో కొందరు వెంట వెంటనే ఈ నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఈ రంగంలో నిబద్ధత కంటే అవకాశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, స్టార్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని కమీషన్లపై ఆధారపడడం ద్వారా ఈ వ్యాపారంలో స్థిరమైన లాభాలు సాధించడం కష్టమని కరణ్ జోహర్ తెలిపారు. అందుకే అనేక టాలెంట్ ఏజెన్సీలు ప్రస్తుతం ఈక్విటీ భాగస్వామ్యాల దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. నటీనటులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుని వారి ప్రాజెక్టుల్లో వాటాలు తీసుకుంటూ ఆదాయ మార్గాలను విస్తరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
ఈ రంగంలో 90 శాతం సమయం యాక్టర్స్ పని మాత్రమే కాకుండా వారిని అర్థం చేసుకోవడం తదితర విషయాలను సమర్థవంతంగా నిర్వహించడంలోనే గడిచిపోతుందన్నారు. మూడున్నర దశాబ్దాలుగా తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని చెప్పారు. సక్సెస్, ఫెయిల్యూర్‌కు అలవాటు పడ్డానని తెలిపారు. సంతోషం, బాధలు విజయాపజయాలపై ఆధారపడవని.. అలా అయితే ఒత్తిడిని తట్టుకోవడం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే స్థిరంగా ఉండాలని చెప్పారు. కరణ్ జోహర్ ఏజెన్సీ వద్ద రోహిత్ సరాఫ్, సారా అలీ ఖాన్, శనయా కపూర్, రషా థడానీ వర్క్ చేస్తున్నారు.
గతంలో కరణ్ జోహర్ ఏజెన్సీలో కొనసాగిన జాన్వీ కపూర్, జనవరిలో ధర్మా ప్రొడక్షన్స్ టాలెంట్ మేనేజ్‌మెంట్ నుంచి బయటికివచ్చింది. ఇప్పటి వరకు సినిమా చేయాలి? ఏ బ్రాండ్‌కు ప్రచారం చేయాలి? అన్నది కరణ్ జోహర్ కనుసన్నల్లోనే జరిగింది. అయితే, నెపో కిడ్ ముద్ర వల్ల విమర్శల నుంచి తప్పించుకోవడానికి, జాన్వీ ‘కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్’ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తాజాగా కరణ్ జోహర్ చేసిన వ్యాఖ్యలు జాన్వీ కపూర్‌ను ఉద్దేశించేనా? అన్న చర్చ సాగుతోంది.
Read Also :
దళపతి విజయ్‌కి షాక్ - విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భార్య - హీరోయిన్ కారణంగా చిచ్చు
కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్ - స్టే ఎత్తేసిన కోర్టు
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



