త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి షాక్ – విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించిన భార్య – హీరోయిన్ కార‌ణంగా చిచ్చు

ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి అత‌డి భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్న‌ట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. భ‌ర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు స‌మాచారం. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సంగీత విడాకుల వ్య‌వ‌హారం త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారుంది.

N

News | Published On Feb 27, 2026, 6.19 pm IST

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి షాక్ – విడాకుల కోసం కోర్టును ఆశ్ర‌యించిన భార్య – హీరోయిన్ కార‌ణంగా చిచ్చు
Advertisement

Thalapathy Vijay | త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు, టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న భార్య సంగీత నుంచి విడిపోతున్న‌ట్లుగా గ‌త కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమ‌ర్ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య్‌తో పాటు ఆయ‌న భార్య సంగీత మాత్రం రియాక్ట్ కాలేదు. తాజాగా మ‌రోసారి విజ‌య్‌, సంగీత‌ల విడాకుల వ్య‌వ‌హారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

విడాకులు కోరుతూ కోర్టుకు...

విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టు మెట్లు ఎక్కిన‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ ఇర‌వై ఐదేళ్ల వైవాహిక బంధానికి ఆమె ముగింపు ప‌ల‌కాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతోన్నారు. విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ చెంగ‌ల్ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 20న సంగీత‌తో పాటు విజ‌య్‌ని విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశించిద‌ని అంటున్నారు.

న‌టితో వివాహేత‌ర సంబంధం...

ఓ న‌టితో విజ‌య్‌కి వివాహేత‌ర సంబంధం ఉంద‌ని త‌న పిటిష‌న్‌లో సంగీత ఆరోపించిన‌ట్లు స‌మాచారం. 2021లో న‌టితో విజ‌య్‌కి ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింద‌ని, ఆమెతో ఉన్న బంధాన్ని తెంచుకుంటాన‌ని విజ‌య్ త‌న‌కు హామీ ఇచ్చాడ‌ని, కానీ త‌న మాట‌ను నిల‌బెట్టుకోలేక‌పోయార‌ని త‌న విడాకుల పిటిష‌న్‌లో సంగీత‌ పేర్కొన్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికీ ఆ న‌టితో విజ‌య్ రిలేష‌న్‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడ‌ని, అందుకే భ‌ర్త నుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు ఫ్యామిలీ కోర్టులో సంగీత చెప్పింద‌ని అంటున్నారు. సంగీత విడాకుల పిటిష‌న్ వ్య‌వ‌హారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూమ‌ర్ల‌పై విజ‌య్ స్పందిస్తాడా లేదా అన్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

రెండేళ్లుగా...విడివిడిగా...

విజ‌య్, సంగీత జంట‌గా క‌నిపించి చాలా కాల‌మే అయ్యింది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా గ‌త రెండేళ్లుగా వీరిద్ద‌రు విడివిడిగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. టీవీకే పార్టీ లాంఛ్ చేసిన టైమ్‌తో పాటు సినిమాల‌కు విజ‌య్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వేడుక‌ల్లో సంగీత క‌నిపించ‌లేదు. దాంతో వీర‌ద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చింది నిజ‌మేనంటూ కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఐదు సినిమాలు...

విజ‌య్‌, సంగీత మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కార‌ణ‌మంటూ చెబుతున్నారు. ఆమెతో క‌లిసి విజ‌య్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు చేశాడు. మూడేళ్ల క్రితం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా కూడా వ‌చ్చింది. ఇటీవ‌లే విజ‌య్‌తో ఆ హీరోయిన్‌కు ఉన్న రిలేష‌న్‌పై త‌మిళ‌నాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఆయ‌న వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట పెద్ద దుమారాన్నే రేపాయి.
విజ‌య్ సంగీత 1999 ఆగ‌స్ట్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు జేస‌న్ సంజ‌య్‌తో పాటు కూతురు దివ్య సాషా ఉన్నారు. తండ్రి బాట‌లోనే త‌న‌యుడు జేస‌న్ సంజ‌య్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా సిగ్మా పేరుతో ఓ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు.

 

Advertisement
Advertisement