త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Spirit Movie | ప్రభాస్ స్పిరిట్‌లో లేడీ విల‌న్ – ఎవ‌రీ ఐశ్వ‌ర్య దేశాయ్‌?

ప్ర‌భాస్ స్పిరిట్ నుంచి విల‌న్ వివేక్ ఒబెరాయ్ లుక్‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఐశ్వ‌ర్య దేశాయ్ అనే న‌టి కూడా క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స్పిరిట్ పోస్ట‌ర్‌లో క‌నిపించిన ఈ బ్యూటీ గురించి నెటిజ‌న్లు తెగ వెతుకుతున్నారు.

N

Entertainment | Published On Feb 27, 2026, 7.34 pm IST

Spirit Movie | ప్రభాస్ స్పిరిట్‌లో లేడీ విల‌న్ – ఎవ‌రీ ఐశ్వ‌ర్య దేశాయ్‌?
Advertisement

Spirit Movie |  ప్ర‌భాస్ పాన్ ఇండియ‌న్ మూవీ స్పిరిట్ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టించ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అత‌డి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వివేక్ ఒబెరాయ్‌తో పాటు ఓ లేడీ కూడా ఉంది. క‌ళ్ల‌ద్ధాలు ధ‌రించి సీరియ‌ల్ లుక్‌లో డ్ర‌గ్స్ సేవిస్తున్న‌ట్లుగా ఆమె క‌నిపించింది. ఆమె ఎవ‌ర‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.ఈ ముద్దుగుమ్మ గురించి నెటిజ‌న్ల‌తో పాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్ తెగ‌ సెర్చ్ చేస్తున్నారు.

ఐశ్వ‌ర్య దేశాయ్‌...

స్పిరిట్ పోస్ట‌ర్‌లో క‌నిపించిన ఈ బ్యూటీ పేరు ఐశ్వ‌ర్య దేశాయ్‌. స్పిరిట్‌లో లేడీ విల‌న్‌గా ఈమె క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వివేక్ ఒబెరాయ్‌కి జోడీగా బోల్డ్‌గా ఉంటూనే నెగెటివ్ షేడ్స్‌తో స‌ర్‌ప్రైజింగ్‌గా ఐశ్వ‌ర్య పాత్ర సాగుతుంద‌ని అంటున్నారు. ఐశ్వ‌ర్య క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్‌ సందీప్ వంగా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం. స్పిరిట్ రిలీజ్‌ ఐశ్వ‌ర్య దేశాయ్ పేరు గ‌ట్టిగా వినిపించ‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది. కాగా స్పిరిట్‌తోనే ఐశ్వ‌ర్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ర‌ణ‌వీర్ సింగ్ గ‌ల్లీబాయ్‌...

ఐశ్వ‌ర్య దేశాయ్ భార‌త సంత‌తికి చెందిన ఓ అమెరిక‌న్‌. మోడ‌ల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వ‌ర్య దేశాయ్ 2017లో రిలీజైన జీనా ఇసీ కా నామ్ హై మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ర‌ణ‌వీర్ సింగ్ గ‌ల్లీబాయ్‌లో నిక్కీ న‌రైన్ అనే గ్లామ‌ర్ రోల్‌లో క‌నిపించింది. ఈ సినిమాల కంటే ముందు అలీషా అనే వెబ్‌సిరీస్‌లో న‌టించింది.గ‌త సినిమాల‌కు భిన్నంగా స్పిరిట్ సినిమాలో ఐశ్వ‌ర్య దేశాయ్ పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంద‌ని స‌మాచారం.

ఇంటెన్స్ అండ్ స్టైలిష్‌...

కాగా శుక్ర‌వారం రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌లో వివేక్ ఒబెరాయ్ పొగ‌తాగుతూ ఇంటెన్స్ అండ్ స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
2027 మార్చి 5న స్పిరిట్ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీ సిరీస్‌తో క‌లిసి డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

Advertisement
Advertisement