త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ‌.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్‌

Toxic Movie Postponed | రాకింగ్ స్టార్ యష్ (Yash) న‌టిస్తున్న‌ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic Movie). ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి వార్ సెగ (Middle East Tensions) త‌గిలింది.

D

Entertainment | Published On Mar 4, 2026, 11.31 am IST

Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ‌.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్‌
Advertisement

Toxic Movie Postponed | రాకింగ్ స్టార్ యష్ (Yash) న‌టిస్తున్న‌ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic Movie). ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి వార్ సెగ (Middle East Tensions) త‌గిలింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం మార్చి 19న విడుదల కావాల్సి ఉండ‌గా.. ప్రస్తుతం మధ్య ప్రాచ్యం (Middle East)లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చిత్రాన్ని మేక‌ర్స్ వాయిదా వేశారు (Toxic Movie Postponed).

ఈ సినిమాను జూన్ 4న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్ర‌భావ‌మే సినిమా వాయిదాకి కార‌ణ‌మ‌ని యూనిట్ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌తో క‌నెక్ట్ అవ్వాల‌నే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించిన‌ట్లు పేర్కొంది. అయితే, మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధ ప‌రిస్థితుల కార‌ణంగా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

గల్ఫ్ దేశాలు భారతీయ సినిమాలకు అతిపెద్ద మార్కెట్. ప్ర‌స్తుతం అక్క‌డ యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ సినిమా రిలీజ్ చేసే ప‌రిస్థితి లేదు. ఫ‌లితంగా అన్నీ ఆలోచించి చిత్ర బృందం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణంగానే కొత్త తేదీని ప్ర‌క‌టించింది. టాక్సిక్ చిత్ర యూనిట్ నిర్ణ‌యంతో దురంధ‌ర్ 2 (Dhurandhar 2) సినిమాకి లైన్ క్లియ‌రైన‌ట్లైంది.

గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్‌ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ యష్‌తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కియారా అద్వానీ, న‌య‌న‌తార‌, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సాండ‌ల్‌వుడ్‌, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల ఆడియెన్స్ ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన టాక్సిక్ ఫ‌స్ట్ గ్లింప్స్‌, టీజ‌ర్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచాయి.

https://x.com/TheNameIsYash/status/2029050210719285493

Also Read..

MS Dhoni | ఓవ‌ర్ స్పీడ్‌.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌కు ట్రాఫిక్ చాలాన్‌

Gold And Silver Prices Today | బంగారం, వెండి ధ‌ర‌ల‌పై యుద్ధం ఎఫెక్ట్ లేదా..? ధ‌ర‌లు త‌గ్గుతూనే ఉన్నాయి..

Donald Trump | ట్రంప్ మెడ‌పై ఎర్ర‌టి మ‌చ్చ‌లు.. అధ్య‌క్షుడి ఆరోగ్యంపై మ‌రోసారి చ‌ర్చ మొద‌లు

Advertisement
Advertisement