OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్‌టైమ్‌తో రిలీజ్
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే క్లారిటీ వచ్చేసింది. మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. కేవలం ఓవర్‌సీస్ ఓటీటీ ఆడియెన్స్‌కు మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
Entertainment | Published On May 8, 2026, 2.48 pm IST
OTT | బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ధురంధర్ 2 ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ శుక్రవారం కన్ఫామ్ అయ్యాయి. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మూడు గంటల యాభై రెండు నిమిషాల భారీ రన్‌టైమ్‌తో అన్‌కట్ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ చివరలో ఓ ట్విస్ట్ ఇచ్చింది. కేవలం ఓవర్‌సీస్ ఆడియెన్స్ మాత్రమే తమ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమాను చూడొచ్చని ప్రకటించింది.
జియో హాట్ స్టార్...
ధురంధర్ 2 ఇండియన్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. మే 14 నుంచి ఇండియాలోనూ ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. రిలీజ్ డేట్‌పై మరో ఒకటి రెండు రోజుల్లో జియో హాట్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2000 కోట్ల వసూళ్లు...
రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమాకు ఆధిత్య ధర్ దర్శకత్వం వహించాడు. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ ఇండియన్ మూవీగా చరిత్రను సృష్టించింది. రెండు వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది.
ఆధిత్య ధర్ టేకింగ్...
ధురంధర్ మూవీకి కొనసాగింపుగా దర్శకుడు ఆధిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించారు. రణవీర్‌సింగ్ యాక్షన్, కథలోని మలుపులతో పాటు ఆధిత్య ధర్ టేకింగ్ అద్భతమంటూ ఆడియెన్స్‌తో పాటు సినీ వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.
సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ వెళ్లిన ఓ ఇండియన్ గూఢచారి అక్కడి ఉగ్రవాద నాయకులను ఎలా మట్టుబెట్టాడనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది. పంజాబ్‌కు చెందిన జస్కిరాత్ సింగ్ తన పేరును హమ్జా అలీగా మార్చుకొని పాకిస్థాన్‌కు వెళతాడు. బలోచ్ తెగ నాయకుడు రెహమాన్‌ను చంపేస్తాడు. రెహమాన్ స్థానంలో ల్యారీ సిటీపై ఆధిపత్యం కోసం అర్షద్ పప్పు, ఉజెయిర్ బలోచ్‌తో పాటు మరికొందరు పోటీపడతారు. వారిరి హమ్జా ఎలా ఎదుర్కొన్నాడు. హమ్జా ఇండియన్ స్పై అని తెలిసి ఎస్‌పీ అస్లాం చౌదరితో పాటు మేజర్ ఇక్బాల్ ఏం చేశారు అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



