Huma Qureshi | ప్రియుడిని పెళ్లాడనున్న హుమా ఖురేషి..!
Huma Qureshi | నటి హుమా ఖురేషి త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా నటుడు రచిత్ సింగ్‌తో చెట్టాపట్టాలేసుకొని షికార్లు చేస్తోంది. ఇద్దరూ రిలేషన్‌ను పెళ్ళి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
Entertainment | Published On May 6, 2026, 4.30 pm IST
Huma Qureshi | నటి హుమా ఖురేషి త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా నటుడు రచిత్ సింగ్‌తో చెట్టాపట్టాలేసుకొని షికార్లు చేస్తోంది. ఇద్దరూ రిలేషన్‌ను పెళ్ళి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ జంట నిశ్చితార్థం కూడా జరిగిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలో అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. పెళ్ళి విషయానికి వస్తే.. ఈ ఏడాది అక్టోబర్ చివరలో లేదంటే నవంబర్ జరగొచ్చని సమాచారం. ఏర్పాట్లు సైతం మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మాత్రం ఈ జంట స్పందించలేదు.
స్నేహం ప్రేమగా..
హుమా–రచిత్‌ల పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారిందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, గతకొంతకాలంగా పలు సందర్భాల్లో ఇద్దరూ మీడియాకు కనిపించగా.. వ్యక్తిగత విషయాలను చెప్పేందుకు నిరాకరించారు. ముఖ్యంగా హుమా తన ప్రైవేట్ లైఫ్‌ను మీడియాకు దూరంగా ఉంచడం తెలిసిందే. గతంలో వచ్చిన డేటింగ్ రూమర్స్ వచ్చినా స్పందించలేదు. కానీ, ఈ సారి మాత్రం రచిత్ ఉన్న బంధం పెళ్ళి వరకు చేరిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివాహ వేడుకను అత్యంత సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం ముంబయిలో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్ళి వేదిక ముంబయిలోనే జరుగుతుందా? లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
టాక్సిక్‌లో హుమా..
ఇదిలా ఉండగా.. ఇటీవల థామా చిత్రంతో నటుడిగా పరిచయమైన రచిత్ సింగ్‌పై హుమా సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వట్టి చేతులతో వారణాసి నుంచి ముంబయికి వచ్చి.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని ప్రశంసించింది. అతని పట్టుదల, కృషి ‘థామా’ సినిమాతో మరింత స్పష్టమైందని హుమా అభిప్రాయపడింది. సినిమాల విషయానికి వస్తే.. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్‌తో గుర్తింపు పొందిన హు.. తర్వాత పలు చిత్రాలతో పాటు దక్షిణాదిలోనూ నటించింది. ఇటీవల ఆమె సింగిల్ సల్మాలో కనిపించింది. ప్రస్తుతం టాక్సిక్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హీరోగా యశ్ నటిస్తున్నారు. నయనతార, కియారా అడ్వానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది అభిమానుల ముందుకు రానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



