Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
ఎట్టకేలకు ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్‌గా క్లారిటీ వచ్చింది. జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లలో 1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలో రణవీర్‌సింగ్ హీరోగా నటించాడు.
Entertainment | Published On May 15, 2026, 4.44 pm IST
Dhurandhar 2 | ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నఫ్యాన్స్‌కు జియో హాట్ స్టార్ ఓ గుడ్‌న్యూస్‌తో పాటు బ్యాడ్‌న్యూస్ వినిపించింది. ఓవర్‌సీస్‌లో నేడు (శుక్రవారం ) ఈ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో కూడా ఓటీటీలో ధురంధర్ 2 రిలీజ్ కావచ్చునని ఫ్యాన్స్ భావించారు. కానీ వారికి నిరాశే మిగిలింది.
జియో హాట్ స్టార్...
ఓవర్‌సీస్‌తో పోలిస్తే ఇరవై రోజులు ఆలస్యంగా ధురంధర్ 2 ఇండియాలో విడుదల అవుతోంది జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక రోజు ముందుగానే జూన్ 4న సాయంత్రం ఏడు గంటలకు ధురంధర్ 2 డిజిటల్ ప్రీమియర్‌ను టెలికాస్ట్ చేయబోతున్నట్లు జియో హాట్ స్టార్ వెల్లడించింది. మూడు గంటల యాభై రెండు నిమిషాల రన్‌టైమ్‌తో ఓటీటీలోకి ధురంధర్ 2 రాబోతుంది. ఓటీటీ వెర్షన్ కోసం కొన్ని కొత్త సీన్లను యాడ్ చేయబోతున్నారట. తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.
రామ్‌చరణ్ మూవీకి పోటీగా...
రామ్ చరణ్ పెద్ది మూవీ జూన్ 4న థియేటర్లలోకి రాబోతుంది. పెద్దికి పోటీగా ధురంధర్ 2 ఓటీటీలోకి రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ధురంధర్ 2 ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా నార్త్‌లో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు.
సారా అర్జున్ హీరోయిన్...
రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్ అతిథి పాత్రలో కనిపించింది. రెండు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 1800 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సెకండ్ మూవీగా నిలిచింది.
సీక్రెట్ ఆపరేషన్...
రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటుచేసిన ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా పేరు మార్చుకొని పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ఇండియన్ గూఢచారికి అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? తన లక్ష్యాన్ని అతడు ఎలా చేరుకున్నాడు అనే అంశాలతో దేశభక్తి, యాక్షన్ అంశాల ప్రధానంగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..
- ●Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భర్తీకి అనుమతించిన ప్రభుత్వం!
- ●Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..

Water Board | వాటర్‌బోర్డులో 965 ఉద్యోగాలు.. భర్తీకి అనుమతించిన ప్రభుత్వం!

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!






