Oscar Awards | ఆస్కార్‌లో సత్తాచాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఆరు విభాగాల్లో అవార్డుల పంట
Oscar Awards | సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another) చిత్రానికి అవార్డుల పంట పండింది.
Entertainment | Published On Mar 16, 2026, 10.47 am IST
Oscar Awards | సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా సాగింది. 98వ అకాడమీ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another) చిత్రానికి అవార్డుల పంట పండింది.
లియోనార్డో డికాప్రియో ( Leonardo DiCaprio) నటించిన ఈ చిత్రం 13 విభాగాల్లో నామినేషన్లు సాధించగా.. ఇప్పుడు ఏకంగా ఆరు కేటగిరీల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (పాల్ థామస్ ఆండర్సన్), ఉత్తమ సహాయ నటుడు (సీన్ పెన్), ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
"వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రానికి పాల్ థామస్ అండర్సన్ (Paul Thomas Andersons) నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు కూడా ఆయనే. లియోనార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనిసియో డెల్ టోరో ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 26, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. థామస్ పించన్ 1990లో రాసిన 'వైన్‌ల్యాండ్' (Vineland) నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 130 నుంచి 175 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 209.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ.. ఆండర్సన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
పలు అవార్డులు..
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనే కాదు.. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. 31వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో 'ఉత్తమ చిత్రం' (Best Picture) సహా మూడు విభాగాల్లో విజయం సాధించింది. అదేవిధంగా 83వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో 'ఉత్తమ చలనచిత్రం - మ్యూజికల్ లేదా కామెడీ' (Best Motion Picture – Musical or Comedy) సహా నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. 32వ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (SAG) అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. రికార్డు స్థాయిలో ఏడు నామినేషన్లను దక్కించుకోగా, 'అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై ఎ కాస్ట్' సహా ఒక విభాగంలో విజేతగా నిలిచింది.
Also Read..
Oscar Awards | అట్టహాసంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. విజేతలు వీరే
Oscar Awards | ఆస్కార్ అవార్డులు.. ఉత్తమ చిత్రం ఇదే..
Priyanka Chopra | ఆస్కార్ వేడుకలో ప్రియాంక చోప్రాకు తప్పిన ప్రమాదం - వీడియో వైరల్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






