OTT | హయ్యెస్ట్ ఆస్కార్స్ గెలుచుకున్న లియోనార్డో డికాప్రియో మూవీని ఏ ఓటీటీలో చూడాలంటే?
లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 2026 ఆస్కార్స్ ఆరు పురస్కారాలను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT | 98వ ఆస్కార్ అవార్డుల్లో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ సత్తా చాటింది. ఏకంగా ఆరు అస్కార్ పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్‌తో పాటు మరో మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.
జియో హాట్ స్టార్‌లో...
లియోనార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనిసియో డెల్‌టోరో కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించాడు. 130 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 210 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
బాబ్ అజ్ఞాతజీవితం...
థామస్ పించన్ రాసిన వైన్‌లాండ్ నవల ఆధారంగా దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఈ మూవీని తెరకెక్కించాడు. 1970ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన 'ఫ్రెంచ్ 75'సభ్యుడైన బాబ్ ఫెర్గూసన్ (లియోనార్డో డికాప్రియో) తన గతం గురించి ఎవరికి తెలియకుండా రహస్య పేరుతో జీవిస్తుంటాడు. కల్నల్ లాక్‌జా (సీన్ పెన్) బాబ్ కోసం చాలా కాలంగా వెతుకుతుంటాడు. లాక్‌జా దాడుల నుంచి బాబ్ , అతడి కుమార్తె విల్లా ఎలా తప్పించుకున్నారు. వ్యవస్థను మార్చాలని ప్రయత్నించిన బాబ్ ఎందుకు రహస్యంగా బతకాల్సివచ్చింది? ఓ తండ్రి చేసిన పోరాటం అతడి కూతురికి ఎలా శాపంగా మారింది అన్నది దర్శకుడు హృద్యంగా చూపించారు. బాబ్ పాత్రలో టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో అసమాన నటనను కనబరిచాడు. గత ఏడాది హాలీవుడ్‌లో రిలీజైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Disha Patani | హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం.. స్పెషల్ శిక్షణ తీసుకుంటున్న హాట్‌బ్యూటీ దిశా పటానీ..!
మే 13, 2026

Movie Collections | 1400 కోట్లతో తీస్తే ఆరు కోట్లు వచ్చాయి… వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్ మూవీ ఇదే
మే 9, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



