త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddar Awards | డిప్యూటీ సీఎం భట్టి చేతికి గద్దర్ అవార్డుల విజేతల వివరాలు..

Gaddar Awards | సినీ రంగాన్ని ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క గ‌ద్ద‌ర్ ఫిల్మ్‌ అవార్డుల‌ను (Gaddar Awards) ప్ర‌వేశ‌పెట్టింది. గ‌తేడాది నుంచి ఈ వార్డుల‌ను అందిస్తున్న‌ది. ఈసారి ఉగాది పండుగ రోజున ఆయా విభాగాల్లో విజేత‌ల‌కు అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నుంది.

G

Entertainment | Published On Mar 7, 2026, 11.33 am IST

Gaddar Awards | డిప్యూటీ సీఎం భట్టి చేతికి గద్దర్ అవార్డుల విజేతల వివరాలు..
Advertisement

Gaddar Awards | త్రినేత్ర‌.న్యూస్‌: సినీ రంగాన్ని ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క గ‌ద్ద‌ర్ ఫిల్మ్‌ అవార్డుల‌ను (Gaddar Awards) ప్ర‌వేశ‌పెట్టింది. గ‌తేడాది నుంచి ఈ వార్డుల‌ను అందిస్తున్న‌ది. ఈసారి ఉగాది పండుగ రోజున ఆయా విభాగాల్లో విజేత‌ల‌కు అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో పుర‌స్కార గ్ర‌హీత‌ల‌ జాబితాను ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు (Mallu Bhatti Vikramarka) జ్యూరీ అంద‌జేసింది.

తెలంగాణ ఏర్పాటుతో ఉమ్మ‌డి రాష్ట్రంలో సినీరంగానికి అప్ప‌టివ‌ర‌కు ఇస్తున్న నంది అవార్డుల ప్ర‌దానోత్స‌వం నిలిచిపోయింది. దీంతో 10 ఏండ్ల‌ తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డులను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. గ‌తేడాది జూన్ 14న అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌గా, ఈసారి ఉగాది రోజున ఇవ్వ‌నుంది. గతంలో నంది అవార్డుల కంటే భారీ స్థాయిలో నగద బహుమతిని అందిస్తున్న‌ది.

ఇవికూడా చ‌ద‌వండి..

సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. యుద్ధం ఎఫెక్ట్ మొద‌లైందా..?

ఉద్యోగుల‌కు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. 300 మందిపై వేటు..!

Advertisement
Advertisement