Raja Saab Movie Theatre | రాజాసాబ్ థియేటర్ లో ఫ్యాన్స్ హారతికి వ్యాపించిన మంటలు.. తప్పిన ప్రమాదం..
Raja Saab Movie Theatre | ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా థియేటర్ల వద్ద భారీ ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నారు.
Entertainment | Published On Jan 11, 2026, 8.14 am IST
Raja Saab Movie Theatre | ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా థియేటర్ల వద్ద భారీ ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లోనూ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ తెరపై కనిపించినప్పుడల్లా చప్పట్లు, ఈలలతో హోరెత్తిస్తున్నారు. ఇక సినిమాలో ప్రభాస్ మొసలితో చేసే ఫైట్ కారణంగా ఫ్యాన్స్ కొందరు బొమ్మ మొసళ్లను తెచ్చి మరీ థియేటర్లలో సినిమాను చూస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఫ్యాన్స్ మాత్రం వేడుకల్లో కాస్త శృతి మించారు. కానీ అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఒడిశాలోని రాయగడలో ఉన్న అశోక్ టాకీస్ హాల్ అనే సినిమా థియేటర్‌లో రాజాసాబ్ మూవీ ప్రదర్శించబడుతున్న సమయంలో ఫ్యాన్స్ కొందరు బాణసంచా కాల్చారు. అలాగే తెర దగ్గర ఏకంగా ప్రభాస్‌కు మంటలతో హారతి పట్టారు. ఈ క్రమంలో కాసేపు మంటలు ఎక్కువగా వ్యాపించాయి. అయితే కొందరు వెంటనే స్పందించి ఎట్టకేలకు మంటలను ఆర్పారు. లేదంటే థియేటర్ తెరకు ముందుగా మంటలు అంటుకుని తరువాత థియేటర్ మొత్తం వ్యాపించేవి. కానీ ప్రేక్షకులు కొందరు స్పందించి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటలు వ్యాపిస్తున్న క్రమంలో కొందరు ప్రేక్షకులు థియేటర్ బయటకు పరుగులు తీశారు. తరువాత పరిస్థితి చక్కబడడంతో వెంటనే లోపలికి వచ్చి సినిమా చూశారు. కాగా ఈ సంఘటనకు తాలూకు వీడియోను జర్నలిస్టు సిరాజ్ నురాని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా తెరకే నిప్పు పెట్టబోయారని, కానీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ ఇలా అతి చేయడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
కాగా ప్రభాస్ రాజాసాబ్ మూవీకి మొదటి రోజు ఓపెనింగ్స్ చక్కగానే వచ్చాయి. రూ.53.75 కోట్లను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కానీ రెండో రోజూ వసూళ్లు సగానికి సగం పడిపోయాయి. శనివారం కేవలం రూ.25 కోట్లను మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చాలా మంది ప్రభాస్ రాజా సాబ్ మూవీకి నెగెటివ్ రివ్యూలను ఇస్తుండడం గమనార్హం. కొందరు దర్శకుడు మారుతికి ఫోన్ చేసి ఆయనను బెదిరిస్తున్నారని ఆయనే స్వయంగా తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో చెప్పారు. అయితే ప్రభాస్‌కు చెందిన ఓల్డ్ గెటప్‌లలో ఉన్న కొన్ని సీన్లను సినిమాలో కలుపుతున్నామని, ఆదివారం నుంచి ఆ సీన్లను చూడవచ్చని దర్శకుడు మారుతి చెప్పారు. ఇక సినీ పండితులు, విశ్లేషకుల ప్రకారం రాజాసాబ్ మూవీ దారుణమైన డిజాస్టర్ అయిందని టాక్ వినిపిస్తోంది.
Fire broke out in the Ashok Talkies Hall in Rayagada
South superstar #Prabhas' film was playing in the hall
Incident during Prabhas' entry in the cinema
During Prabhas' entry, fans shouted and threw arrows in front of the screen.#Rayagada #FireIncinemahall #Odisha pic.twitter.com/88Nhh5ysDY— Siraj Noorani (@sirajnoorani) January 10, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






