Meenakshi Chaudhary | ఆ లెక్కలు వేసుకోను – డ్యాన్స్ చేయడానికి సిగ్గు పడుతుంటా – మీనాక్షి చౌదరి కామెంట్స్…
సినీ జర్నీ అన్నది ముగింపు లేని రన్నింగ్ రేస్ లాంటిదని మీనాక్షి చౌదరి అన్నది. కొత్త వాళ్ల నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి విభిన్నమైన పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలని చెప్పింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన అనగనగా ఒక రాజు సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Jan 11, 2026, 8.13 pm IST
Meenakshi Chaudhary | తన దృష్టిలో కథే సినిమాకు హీరో అని అన్నది మీనాక్షి చౌదరి. కథ నచ్చితే హీరో ఎవరనే పట్టింపులు లేకుండా సినిమాలు చేస్తానని చెప్పింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. అనగనగా ఒక రాజు సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ గురించి మీనాక్షి చౌదరి ఏమన్నదంటే....
గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మెప్పిస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టిగా కనిపిస్తా. చ నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూశాను. ఆ అనుభవం నా పాత్రకు న్యాయం చేయడానికి పనికొచ్చింది. రియల్‌లైఫ్‌కు భిన్నమైన క్యారెక్టర్‌ను చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. రియల్‌లైఫ్‌లో నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.
కామెడీ టైమింగ్...
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టమైంది. నా సినీ జర్నీలో ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టమని ఈ సినిమాతో అర్థమైంది.
సాధారణంగా నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను. కానీ, ఈ సినిమాలో అలాంటి ఇబ్బంది కలగలేదు. భీమవరం బాల్మా, రాజు గారి పెళ్ళిరో పాటలో డ్యాన్ చేయడం కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది.
కొత్త కోణంలో...
ఇదివరకు హీరోయిన్లు పాటలు, గ్లామర్‌కు పరిమితమనే అపోహ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. అనగనగా ఒక రాజు నటిగా నన్ను మరో కోణంలో ఆవిష్కరిస్తుంది.
కథే హీరో...
నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తాను. నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని రన్నింగ్ రేస్ లాంటిది. కొత్త వాళ్ల నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు వేసుకోను. చేతిలో సినిమాలు ఉండటం ముఖ్యమని భావిస్తాను. అనగనగా ఒక రాజు తర్వాత నాగ చైతన్య వృషకర్మ హీరోయిన్‌గా నటిస్తున్నా. ఇందులో దక్ష అనే అర్కియాలజిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా
సంబంధిత వార్తలు

Avika Gor | ఫారిన్లో ఇళ్లు కొన్న టాలీవుడ్ హీరోయిన్ – సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?
మే 10, 2026

Reba Monica John | తల్లి కాబోతున్న శ్రీవిష్ణు హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలతో గుడ్‌న్యూస్…
మే 1, 2026

Samantha Birthday Photos | సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్ …ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన సామ్
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



