త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | ఈ సారి పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌ల‌కు నాకు సంబంధం లేదు – మినిస్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి కామెంట్స్‌

సినిమా ఇండ‌స్ట్రీపై మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఇండ‌స్ట్రీని గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని అన్నారు. సంక్రాంతికి సినిమాల‌కు పెరిగిన టికెట్ ధ‌ర‌ల‌కు త‌న‌కు సంబంధం లేద‌ని అన్నారు.

N

Entertainment | Published On Jan 10, 2026, 4.58 pm IST

Komatireddy Venkat Reddy  | ఈ సారి పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌ల‌కు నాకు సంబంధం లేదు – మినిస్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి కామెంట్స్‌
Advertisement

Komatireddy Venkat Reddy |  టాలీవుడ్‌పై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. సినిమా ఇండ‌స్ట్రీని ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని అన్నారు. శ‌నివారం కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పాత్రికేయుల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా సినిమా ఇండ‌స్ట్రీ గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ "పుష్ప 2 త‌ర్వాత బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచ‌మ‌ని ఎవ‌రూ నా ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని చెప్పాను. అప్లికేష‌న్లు పెట్టొద్దు. న‌న్ను క‌ల‌వద్ద‌ని అన్నాను. ఇప్ప‌టికీ ఇదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నా. ఆ మ‌ధ్య రిలీజైన రెండు సినిమాల‌తో పాటు రాజాసాబ్‌, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు సినిమాల‌కు సంబంధించిన టికెట్ ధ‌ర‌ల ఫైల్స్ నా ద‌గ్గ‌ర‌కు రాలేదు. న‌న్ను ఎవ‌రూ క‌ల‌వ‌లేదు. టికెట్ ధ‌ర‌ల పెంపు గురించి వ‌స్తున్న జీవోల‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు" అన్నారు. మినిస్ట‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ప్ర‌భాస్ సినిమాకు క్యాన్సిల్‌....

ఇటీవ‌ల రిలీజైన ప్ర‌భాస్ రాజాసాబ్‌కు తెలంగాణ‌లో బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. టికెట్ రేట్ల పెంపు జీవోను అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత రిలీజ్ చేశారు. ఆ జీవోను మ్యాట్నీ షోలోపే హైకోర్టు కొట్టేసింది. ఇక నుంచి తెలంగాణ‌లో సినిమా టికెట్ రేట్ల‌ను పెంచ‌ద్దంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు తీర్పు వెలువ‌రించి ఒక్క రోజు కూడా కాకుండానే చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. స్పెష‌ల్ షో ప్ర‌ద‌ర్శించేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది. రాజాసాబ్‌తో పాటు మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మేక‌ర్స్ ఒకే రోజు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించారు. కానీ రాజాసాబ్‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా చిరంజీవి సినిమాకు ఫేవ‌ర్ చేయ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజాసాబ్ బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయ‌డంలో నిర్మాత‌లు భారీగానే న‌ష్టం వాటిల్లింది. హైకోర్టుకు నేటి నుంచి 19వ తేదీ వ‌ర‌కు సెల‌వులు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. దాంతో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు జీవోను కొట్టివేసేందుకు ఆస్కారం లేకుండాపోయింద‌ని అంటున్నారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ తెలంగాణ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌డుతున్నారు. ఒక‌రికి ఫేవ‌ర్ చేసి మ‌రొక‌ర‌ని న‌ష్టం క‌లిగించ‌డం స‌రికాదంటూ అంటున్నారు. ఈ వివాదాల‌తో నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ గురించి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పెరిగిన టికెట్ ధ‌ర‌ల‌కు నాకు సంబంధం లేదంటూ పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement