త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGO | మ‌హిళా ఐఏఎస్‌పై అస‌త్య ప్ర‌చారాన్ని ఖండించిన టీజీవో సంఘం

TGO | రాష్ట్రంలో బాధ్య‌తాయుత‌మైన విధుల్లో ఉన్న మ‌హిళా ఐఏఎస్ అధికారిపై ప‌లు మీడియా సంస్థ‌లు, సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌ల‌ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్రం సంఘం అధ్య‌క్షుడు ఏలూరి శ్రీ‌నివాస‌రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీ శ్యామ్ ఖండించారు.

P

Telangana | Published On Jan 11, 2026, 9.01 pm IST

TGO | మ‌హిళా ఐఏఎస్‌పై అస‌త్య ప్ర‌చారాన్ని ఖండించిన టీజీవో సంఘం
Advertisement

TGO | రాష్ట్రంలో బాధ్య‌తాయుత‌మైన విధుల్లో ఉన్న మ‌హిళా ఐఏఎస్ అధికారిపై ప‌లు మీడియా సంస్థ‌లు, సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌ల‌ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్రం సంఘం అధ్య‌క్షుడు ఏలూరి శ్రీ‌నివాస‌రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీ శ్యామ్ ఖండించారు. మ‌హిళా అధికారి వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసేలా, ఆమె గౌర‌వానికి, ప‌రువుకు భంగం క‌లిగించేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా కేవలం సంచలనం కోసం ఒక మహిళా అధికారిపై అసత్య ప్రచారాలు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

అధికారి మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయ‌డ‌మే కాకుండా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అధికారులందరిపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని హెచ్చ‌రించారు. త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసిన మీడియా సంస్థ‌లు త‌క్ష‌ణం బేష‌ర‌తుగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని టీజీవో సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా జాక్ భాగస్వామ్య సంఘాలతో చర్చించి నిరసనలు చేపడతామని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement