Piracy Network | నవీన్.. మరో ఐబొమ్మ రవి.. శ్రీలంకలో రాజా సాబ్ పైరసీ నిందితుడు!
Piracy Network | తెలుగు సినిమా ఇండస్ట్రీని పైరసీ (Piracy Network)బూతం వదలడం లేదు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని (iBomma Ravi) అరెస్టు చేసినప్పటికీ పైరసీ కారులు తమను ఎవరూ ఆపలేరంటూ పోలీసులకు కొరకరాని కొయ్యలుగా మారారు.
Entertainment | Published On Jan 11, 2026, 12.03 pm IST
త్రినేత్ర.న్యూస్: తెలుగు సినిమా ఇండస్ట్రీని పైరసీ (Piracy Network)బూతం వదలడం లేదు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని (iBomma Ravi) అరెస్టు చేసినప్పటికీ పైరసీ కారులు తమను ఎవరూ ఆపలేరంటూ పోలీసులకు కొరకరాని కొయ్యలుగా మారారు. పైరసీ నెట్‌వర్క్‌లపై సైబర్ క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా ఆన్‌లైన్‌లో కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన రాజాసాబ్ (Raja Saab) విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అదేవింధంగా సింగిల్ లాంగ్వేజ్‌లో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ధురంధర్ (Dhurandhar) సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మూవీ విడుదలై నెల రోజులు పూర్తయినప్పటికీ ఇంకా బాక్సాఫీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానప్పటికీ ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ అందుబాటులో రావడంతో సిని పరిశ్రమ విస్తుపోయింది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం 5మూవీరూల్జ్, 1తమిళ్ఎంవీ పైరసీ సైట్లలో దర్శనమిస్తున్నాయి.
ఈ రెండు పైరసీ సైట్లను నవీన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీలంక నుంచి వీటిని ఆపరేట్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టెలిగ్రామ్ వేదికగా అతడు తన అనుచరులతో తమిళం, తెలుగు, ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేస్తున్నట్లు గుర్తించారు. అరుదుగా హిందీలో కూడా చాటింగ్ చేస్తున్నాడని సైబర్‌క్రైమ్ అధికారులు వెల్లడించారు. చాటింగ్‌లు, క్రిప్లో కరెన్సీ పేమెంట్ల ఆధారంగా అతడు శ్రీలంకలో ఉండే అవకాశం ఉందని తెలిపారు. అప్పుడప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న లొకేషన్ చూపిస్తున్నదని పేర్కొన్నారు. వీపీఎన్, ప్రాక్సీ సర్వర్లను వినియోగిస్తుండటంతో ఇలా జరుగుతున్నదని చెప్పారు. అందువల్ల ప్రస్తుతం అతడు కచ్చితంగా ఎక్కడున్నాడనే మిస్టరీగా మారిందన్నారు.
ఐబొమ్మ రవి లానే నవీన్ కూడా వీక్షకులను బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ సైట్ల వైపు మళ్లించడం వల్ల నగదు అందుకుంటున్నాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాగా, సినిమా హాళ్లలో కెమెరాల్లో రికార్డు చేసిన ప్రింట్‌లు మాత్రమే ప్రస్తుతం పైరసీ సైట్లలో అందుబాటులో ఉంటేన్నాయని చెప్పారు. వీటిని ఎక్కువగా ఉతర భారతం, ఈశాన్య భారతంలోని థియేటర్లలోనే సినిమాను రికార్డు చేస్తున్నారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు పైరసీ సైట్ల కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐబొమ్మ, 1తమిళ్‌బ్లాస్టర్ వలే 5మూవీరూల్జ్, 1తమిళ్ఎంవీ సైట్ల వెనుక ఉన్నవారిని కూడా పట్టుకుంటామన్నారు.
తరచూ డొమైన్లను మారుస్తుండటం వల్లే..
ఆ రెండు పైరసీ సైట్లపై ఇంటర్నెట్ ప్రొవైడర్లకు తాము ఫిర్యాదు చేశామని, దీంతో వారు వాటిని బ్లాక్ చేస్తుండటంతో పైరసీ దారులు తరచూ డొమైన్లను మారుస్తున్నారని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ప్రతినిధి తెలిపారు. 5మూవీరూల్జ్ ప్రస్తుతం డాట్‌డాక్టర్ అనే పేరుతో, 7మూవీలరూల్స్.సీఎల్ పేరుతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా 1తమిళ్ఎంవీ ఎక్స్‌టెన్షన్‌గా .ఎల్‌సీ.గా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందన్నారు. ప్రతీ వారం డొమైన్లను మారుస్తున్నారని, దీంతో ఆయా వెబ్‌సైట్లపై ట్రాఫిక్ ఎంత ఉందని కచ్చితంగా చెప్పలేమన్నారు.
అయితే జనవరిలో తొలి పది రోజుల్లో 5మూవీరూల్జ్‌ను 18 లక్ష మంది వీక్షించారని, అందులో 80 శాతం మంది భారత్ నుంచే ఉన్నారని చెప్పారు. అదేవిధంగా ఈ నెలలో ఇప్పటివరకు 1తమిళ్ఎంవీ.ఎల్‌సీని 23 లక్షల మంది చూశారని, అందులో 94 శాతం ఇండియా నుంచే ఉన్నారని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026

Sara Arjun | కోలీవుడ్లోకి ధురంధర్ 2 హీరోయిన్ ఎంట్రీ – ధనుష్‌తో రొమాన్స్
ఏప్రిల్ 14, 2026

Dhurandhar 2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ధురంధర్ 2.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఏప్రిల్ 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



