త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sammakka – The Glory of Medaram | మేడారం వైభవం కళ్లకు కట్టేలా.. ‘సమ్మక్క – ది గ్లోరీ ఆఫ్ మేడారం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

మేడారం గిరిజన జాతర వైభవాన్ని, అక్కడి ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన 'సమ్మక్క - ది గ్లోరీ ఆఫ్ మేడారం' పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

J

Telangana | Published On Jan 11, 2026, 8.32 pm IST

Sammakka – The Glory of Medaram | మేడారం వైభవం కళ్లకు కట్టేలా.. ‘సమ్మక్క – ది గ్లోరీ ఆఫ్ మేడారం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

సంక్షిప్త సారాంశం

సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన 'సమ్మక్క - ది గ్లోరీ ఆఫ్ మేడారం' పుస్తకాన్ని మంత్రి సీతక్క మేడారంలో ఆవిష్కరించారు. 1994 నుండి జాతర విధుల్లో ఉన్న రచయిత తన అనుభవాలను, మేడారం జాతర ప్రాముఖ్యతను, మీడియా నిర్వహణలోని సవాళ్లను ఈ పుస్తకంలో వివరించారు. గిరిజన సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక గొప్ప సమాచార నిధిగా నిలుస్తుంది.

Advertisement

Sammakka - The Glory of Medaram | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పే దిశగా మరో అడుగు పడింది. వరంగల్ మాజీ డీపీఆర్వో, ప్రస్తుత సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన 'సమ్మక్క - ది గ్లోరీ ఆఫ్ మేడారం' (Sammakka - The Glory of Medaram) పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదివారం మేడారంలో ఆవిష్కరించారు.

అరుదైన సమాచార నిధి

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతర ప్రాముఖ్యతను, భక్తుల విశ్వాసాన్ని కళ్లకు కట్టేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. దశాబ్దాలుగా జాతర విధుల్లో ఉంటూ, క్షేత్రస్థాయిలో తాను గమనించిన అంశాలను వ్యాస రూపంలో రచయిత పొందుపరిచారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, మేడారం వడ్డే పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, ములుగు డీపీఆర్వో రఫీ తదితరులు పాల్గొన్నారు.

పుస్తక విశేషాలు

రచయిత కన్నెకంటి వెంకటరమణ 1994 నుండి నిరంతరాయంగా మేడారం జాతర విధుల్లో పాల్గొంటున్నారు. ములుగు డివిజనల్ పీఆర్వోగా, వరంగల్ డీపీఆర్వోగా తన 30 ఏళ్ల అనుభవంలో జాతరలో చోటుచేసుకున్న మార్పులనుపుస్తకంలో వివరించారు.

మీడియా మేనేజ్మెంట్: కోటికి పైగా భక్తజనం వచ్చేజాతరలో మీడియా నిర్వహణ ఎంత సంక్లిష్టమైనదో వివరించారు.

సంస్కృతీ సంప్రదాయాలు: కోయ గిరిజనుల ఆచారాలు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల మొక్కులు, జాతర విశిష్టతను ఇతర పుణ్యక్షేత్రాలతో పోలుస్తూ విశ్లేషించారు.

నిరంతర పోరాటం: నమ్మిన జనం కోసం ప్రాణాలిచ్చిన తల్లుల ధిక్కార స్వరాన్ని, గిరిజన చైతన్యాన్నిపుస్తకం ప్రతిబింబిస్తుంది.

పుస్తకం మేడారంపై అధ్యయనం చేసే పరిశోధకులకు, జర్నలిస్టులకు, సామాన్య భక్తులకు ఒక కైవారంగా నిలుస్తుంది.

పుస్తకం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు

9849905900 , 9490396828
కన్నెకంటి వెంకట రమణ
జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ

 

Advertisement

తాజావార్తలు

Advertisement