త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amitabh Bachchan | బ‌తికిపోయా.. వ‌రుస బెదిరింపుల వేళ‌ అర్ధ‌రాత్రి అమితాబ్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Amitabh Bachchan | వ‌రుస బెదిరింపుల‌ (Bomb Threats) వేళ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) అర్ధ‌రాత్రి ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ఎలాంటి సంద‌ర్భాన్ని ప్ర‌స్తావించ‌కుండానే "బ‌తికిపోయా" (Bach Gaye) అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

D

Entertainment | Published On Nov 16, 2026, 1.08 pm IST

Amitabh Bachchan | బ‌తికిపోయా.. వ‌రుస బెదిరింపుల వేళ‌ అర్ధ‌రాత్రి అమితాబ్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌
Advertisement

Amitabh Bachchan | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan)కు వ‌రుస బెదిరింపులు (Bomb Threats) ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆయ‌న నివాసం జ‌ల్సా (Jalsa) వెలుప‌ల కాల్పులు జ‌రిపేందుకు ప‌న్నిన కుట్ర‌ను పోలీసులు భ‌గ్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బిగ్‌బీ అర్ధ‌రాత్రి ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ఎలాంటి సంద‌ర్భాన్ని ప్ర‌స్తావించ‌కుండానే "బ‌తికిపోయా" (Bach Gaye) అంటూ హిందీలో ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాగా, గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలోనే అమితాబ్ నివాస‌మైన జ‌ల్సాకు మూడుసార్లు బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తొలిసారి అక్టోబర్ 23న వచ్చిన బెదిరింపులో మేయర్ రితు తావ్డే కార్యాలయంపై, అమితాబ్ బచ్చన్ నివాసం జల్సాపై దాడి చేస్తామని ఆగంత‌కులు హెచ్చరించారు. నవంబర్ 6న, నవంబర్ 12న కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. వ‌రుస బెదిరింపుల‌తో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు బిగ్ బీ నివాసం వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

ఈ క్ర‌మంలో జ‌ల్సా వెలుప‌ల కాల్పులు జ‌రిపేందుకు ప‌న్నిన కుట్ర‌ను ఢిల్లీ పోలీసులు భ‌గ్నం చేశారు. గ్యాంగ్‌స్ట‌ర్‌ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం అరెస్ట్ చేసింది. జలంధర్‌కు చెందిన వికాస్ థాకూర్ అలియాస్ విక్కీ, పంజాబ్‌లోని తర్న్‌ తరణ్ నివాసి దీపక్ సింగ్ అలియాస్ దీప్ అనే ఇద్ద‌రు షూట‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు (anti-Sikh riots) సంబంధించి బిగ్‌బీ గ‌తంలో చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న ఓ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న కార‌ణంగా విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఆయ‌న్ని షూట‌ర్లు ల‌క్ష్య‌గా చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదని అమితాబ్ బచ్చన్ గతంలోనే ఖండించారు. అరెస్టైన ఇద్దరు షూటర్లు ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి డబ్బు వసూలు చేసేందుకు, అలాగే ముంబైలో అమితాబ్ ఇంటి వద్ద కాల్పులు జరిపేందుకు వేర్వేరుగా ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల అసలు ఉద్దేశం ఏమిటి..? వారిని దాడి చేయ‌మ‌ని ఎవ‌రు ఆదేశించారు..? అనే కోణంలో ప్రద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

పెండింగ్ చాలాన్ క్లియ‌రెన్స్‌.. రూ.500 ఫైన్‌కు రూ.100 క‌డితే చాలు..

స‌చిన్‌తో గ‌ల్లీ క్రికెట్ ఆడిన బ్రిట‌న్ యువ‌రాజు విలియ‌మ్స్‌.. ముంబై వీధుల్లో రోమింగ్‌

క‌డుపుతో ఉన్న‌ప్పుడు రోజుకు 100 సిగ‌రెట్లు కాల్చా : ప్ర‌ముఖ న‌టి

Advertisement
Advertisement