త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pending Traffic Challans | పెండింగ్ చాలాన్ క్లియ‌రెన్స్‌.. రూ.500 ఫైన్‌కు రూ.100 క‌డితే చాలు..

Pending Traffic Challans | వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్‌. ట్రాఫిక్‌ చాలాన్లు పెండింగ్ (Pending Traffic Challans) ఉన్నాయా? అయితే.. రూ.500 ఫైన్ బ‌దులు రూ.100 చెల్లిస్తే స‌రిపోతుంది. వెంట‌నే చెల్లిస్తే ఒక్కో చాలాన్‌పై రూ.400 సేవ్ చేసుకోవ‌చ్చు!.

G

National | Published On Nov 16, 2026, 12.50 pm IST

Pending Traffic Challans | పెండింగ్ చాలాన్ క్లియ‌రెన్స్‌.. రూ.500 ఫైన్‌కు రూ.100 క‌డితే చాలు..
Advertisement

Pending Traffic Challans | త్రినేత్ర న్యూస్‌: వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్‌. ట్రాఫిక్‌ చాలాన్లు పెండింగ్ (Pending Traffic Challans) ఉన్నాయా? అయితే.. రూ.500 ఫైన్ బ‌దులు రూ.100 చెల్లిస్తే స‌రిపోతుంది. వెంట‌నే చెల్లిస్తే ఒక్కో చాలాన్‌పై రూ.400 సేవ్ చేసుకోవ‌చ్చు!. ఓ.. ఎగిరి గంతేయ‌కండి.. ఈ బంప‌రాఫ‌ర్ మ‌న రాష్ట్రంలో కాదు. హ‌ర్యానా, పంజాబ్ ఉమ్మ‌డి రాజ‌ధాని చండీగఢ్‌లో (Chandigarh)..

చండీగఢ్ జిల్లా కోర్టు (Chandigarh District Courts) సోమవారం నుంచి పాత పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను (Pending Challans) కేవలం రూ.100 చెల్లించి పరిష్కరించుకునే ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వాహనదారులు పెండింగ్‌లో ఉన్న తమ ట్రాఫిక్ చలాన్లను సాధారణ జరిమానా రూ.500కు బదులుగా కేవలం రూ.100 చెల్లించి క్లియర్ చేసుకోవచ్చు. కోర్టుల్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న చాల‌న్ల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఈ ప్రత్యేక పరిష్కార డ్రైవ్ మొదటి దశలో 2023 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి మధ్య జారీ అయిన మొత్తం 8,500 పెండింగ్ చలాన్లను (Traffic Challans) చేచ్చింది. ఈ రాయితీ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 కింద జారీ చేసిన చలాన్లకు వర్తిస్తుంద‌ని తెలిపింది. వీటిలో ప్ర‌ధానంగా రాంగ్ పార్కింగ్, జీబ్రా క్రాసింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. వాహనదారులు చండీగఢ్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పబ్లిక్ నోటీసును చూసి తమ వాహనం ట్రాఫిక్ చలాన్ స్టేటస్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా చండీగఢ్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లోని లింక్‌ల ద్వారా యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌ ద్వారా జరిమానాలను చెల్లించే అవ‌కాశం క‌ల్పించింది. వాహ‌న‌దారులు ఆఫ్‌లైన్‌లోనూ ట్రాఫిక్ చలాన్లను చెల్లించవచ్చు.

Advertisement
Advertisement