త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alia Bhatt | క‌డుపుతో ఉన్న‌ప్పుడు రోజుకు 100 సిగ‌రెట్లు కాల్చా : ప్ర‌ముఖ న‌టి

Alia Bhatt | ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సోని ర‌జ్దాన్ (Soni Razdan) ఆసక్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న‌ప్పుడు రోజుకు 100 సిగరెట్లు కాల్చాన‌ని (100 cigarettes in a day) షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో త‌న క‌డుపులో అలియాభ‌ట్ (Alia Bhatt) పెరుగుతోంద‌ని.. ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పుకొచ్చారు.

D

Entertainment | Published On Nov 16, 2026, 12.13 pm IST

Alia Bhatt | క‌డుపుతో ఉన్న‌ప్పుడు రోజుకు 100 సిగ‌రెట్లు కాల్చా : ప్ర‌ముఖ న‌టి
Advertisement

Alia Bhatt | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, అలియాభ‌ట్ (Alia Bhatt) త‌ల్లి సోని ర‌జ్దాన్ (Soni Razdan) ఆసక్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. అలియా త‌న క‌డుపులో (pregnancy) పెరుగుతున్న‌ప్పుడు తాను రోజుకు 100 సిగరెట్లు కాల్చాన‌ని (100 cigarettes in a day) షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. అప్పుడు ప్రెగ్నెంట్ అన్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని.. సినిమా స‌న్నివేశంలో భాగంగా సిగ‌రెట్లు కాల్చిన‌ట్లు చెప్పుకొచ్చారు.

మహేష్ భట్ (Mahesh Bhatt) దర్శకత్వంలో శ్రీదేవి, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గుమ్రా' (Gumrah) చిత్రం 1993లో విడుదలైంది. ఈ సినిమాలో సోని రజ్దాన్ ఒక ఖైదీ పాత్రలో నటించారు. ఆ పాత్ర డిమాండ్ మేరకు ఒక సన్నివేశం కోసం వరుసగా సిగరెట్లు కాల్చాల్సి వచ్చింద‌ని సోని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఆ స‌మ‌యంలో తాను ప్రెగ్నెంట్ అని.. అలియా భ‌ట్ త‌న క‌డుపులో పెరుగుతున్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పుకొచ్చారు. పాత్ర డిమాండ్ మేర‌కు ప‌దేప‌దే ధూమ‌పానం (smoking) చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.

సిగ‌రెట్‌పై క్రేవింగ్స్ పెరిగాయి..

నిజ జీవితంలో తనకు అసలు సిగరెట్లు తాగే అలవాటే లేదని, కానీ ఆ రోజు షూటింగ్ కోసం వంద సిగరెట్లు కాల్చిన త‌ర్వాత తనకు సిగరెట్‌ తాగాలనే కోరిక విపరీతంగా కలిగేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇదే సినిమాలోని కీలకమైన ఉరితీత (gallows) సన్నివేశాన్ని కూడా తాను గర్భవతిగా ఉన్నప్పుడే పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. షూటింగ్‌కు ఐదు నెలల విరామం తర్వాత తిరిగి సెట్స్‌లోకి వెళ్లినప్పుడు, బేబీ బంప్ కారణంగా పాత కాస్ట్యూమ్స్ సరిపోక వాటిని మార్చాల్సి వచ్చిందని ఆమె వివరించారు. ఆ స‌మ‌యంలో తోటి నటీనటులు తనకు ఎంతగానో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. కాగా, సోని రజ్దాన్, ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దంపతులకు 1988లో మొదటి కుమార్తె షాహీన్ భట్ (Shaheen Bhatt) జన్మించగా, ఆ తర్వాత కొన్నేళ్లకు అలియా భట్ జన్మించారు. మొద‌టిసారి ప్రెగ్నెంట్ అయిన స‌మ‌యంలోనూ స‌హ న‌టులు త‌న‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకున్నార‌ని సోని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

Also Read..

వ‌రుస‌గా రెండోసారి.. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏక‌గ్రీవ ఎన్నిక‌

భార‌త్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాల‌తో సంబంధాలే అత్యంత కీల‌కం : ప్ర‌ధాని మోదీ

స్నేహితుడితో క‌ల‌సి బ‌య‌ట‌కు వెళ్లింది.. అట‌వీ ప్రాంతంలో శ‌వ‌మై క‌నిపించింది..

Advertisement
Advertisement