Alia Bhatt | బోల్డ్ లుక్‌లో అలియా భట్ – భర్త సినిమాలో క్యాబరే డ్యాన్సర్‌గా బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ మూవీ లవ్ అండ్ వార్ నుంచి అలియాభట్ పోస్టర్‌ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. రెట్రో స్టైల్‌లో బోల్డ్ లుక్‌తో ఈ పోస్టర్‌లో అలియాభట్ కనిపిస్తోంది. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అలియాభట్ క్యాబరే డ్యాన్సర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 25, 2026, 2.33 pm IST
Alia Bhatt | భర్త రణభీర్‌కపూర్‌తో కలిసి అలియాభట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ అండ్ వార్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ మరో హీరోగా నటిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 21న థియేటర్లలోకి రాబోతుంది.
ఫస్ట్ లుక్...
లవ్ అండ్ వార్ ప్రమోషన్స్‌ను మేకర్స్ అఫీషియల్‌గా మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి గురువారం రణభీర్‌కపూర్ రగ్గ్‌డ్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా శుక్రవారం ఈ లవ్ డ్రామా మూవీ నుంచి అలియాభట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
బోల్డ్ లుక్...
బోల్డ్ లుక్‌లో అలియా భట్ కనిపిస్తున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెట్రో పోస్టర్ చూస్తుంటే అలియాభట్ క్యాబరే డ్యాన్సర్‌గా ఈ బాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె జ్వాల లాంటిది. అందరి గుండెల్లో ప్రేమను పుట్టిస్తుంది అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. లవ్ అండ్ వార్‌లో అలియా భట్ రోల్ చాలా గ్లామరస్‌గా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.
రీసెర్చ్....
కాగా ఈ క్యాబరే డ్యాన్సర్ పాత్ర కోసం అలియాభట్ చాలానే రీసెర్చ్ చేసినట్లు సమాచారం. 1970 - 80 టైమ్‌లో జాజ్ సింగర్స్ బాడీలాంగ్వేజ్, వారి వస్త్రధారణ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని నటించినట్లు చెబుతున్నారు. అలియాభట్ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకటిగా ఈ పాత్ర నిలుస్తుందని అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది.
Sitaare toh hazaar, par chamak iski hai! ✨
Sanjay Leela Bhansali's Love & War on 21st January 2027 ❤️
See you at the movies! 🎬#LoveAndWar@saregamaglobal #RanbirKapoor @vickykaushal09 @aliaa08 #PrernaSingh pic.twitter.com/QOan0QdWlQ
— BhansaliProductions (@bhansali_produc) September 25, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ - నైజాంలో హయ్యెస్ట్
- ●Manmohan Singh | గచ్చిబౌలి విప్రో సర్కిల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం
- ●Air India | ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలం.. కోపైలట్ సస్పెన్షన్
- ●Muslim Couple Wins Ganapathi Laddu | వినాయక వేడుకల్లో వెల్లివిరిసన మతసామరస్యం.. లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు
- ●Khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు
- ●Supreme Court | ఈసీ నిర్ణయాలపై వివాదం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్

Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ - నైజాంలో హయ్యెస్ట్

Manmohan Singh | గచ్చిబౌలి విప్రో సర్కిల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం

Air India | ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలం.. కోపైలట్ సస్పెన్షన్

Muslim Couple Wins Ganapathi Laddu | వినాయక వేడుకల్లో వెల్లివిరిసన మతసామరస్యం.. లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు






