త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ – ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న అలియాభ‌ట్ స్పై థ్రిల్ల‌ర్ మూవీ

అలియా భ‌ట్ బాలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ అల్ఫా థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. శార్వ‌రి మ‌రో హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో బాబీ డియోల్ విల‌న్‌గా న‌టించాడు.

N

Entertainment | Published On Aug 23, 2026, 2.04 pm IST

Alia Bhatt | ఈ ఏడాది బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ – ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న అలియాభ‌ట్  స్పై థ్రిల్ల‌ర్ మూవీ
Advertisement

Alia Bhatt |  అలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టించిన అల్ఫా ఫ‌స్ట్ ఫిమేల్ స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కెరీర్‌లో అలియాభ‌ట్ చేసిన ఫ‌స్ట్ యాక్ష‌న్ మూవీ ఇదే కావ‌డంతో రిలీజ్‌కు ముందు అల్ఫాపై పై భారీగా అంచ‌నాలు ఏర్పాడ్డాయి. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాబీ డియోల్ విల‌న్‌గా న‌టించాడు. అలియా భ‌ట్‌తో పాటు శార్వ‌రి వాఘ్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. అనిల్ క‌పూర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాకు శివ్ ర‌వైల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

150 కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన అల్ఫా వంద కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకొని డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు యాభై కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత అల్ఫా మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. ఆగ‌స్ట్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలియా భ‌ట్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

మిస్ ఫిట్ అంటూ విమ‌ర్శ‌లు...

అల్ఫా మూవీ కోసం అలియాభ‌ట్ చాలానే క‌ష్ట‌ప‌డింది. బాడీ డ‌బుల్‌, డూప్‌ల‌పై ఆధార‌ప‌డ‌కుండా రిస్కీ యాక్ష‌న్ స్టంట్స్ చేసింది. కానీ ఈ యాక్ష‌న్ రోల్‌కు అలియా మిస్ ఫిట్ అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. స్పై థ్రిల్ల‌ర్ క‌థ‌ల్లో ఉండాల్సిన మెరుపులు, ట్విస్ట్‌లు పెద్ద‌గా అల్ఫాలో లేక‌పోవ‌డం కూడా మైన‌స్‌గా మారింది. ధురంధ‌ర్ 2తో తిప్పి తిశారంటూ ఈ సినిమాను ట్రోల్ చేశారు.

సీత క‌థ‌...

సీత ఓ అనాథ‌. ఆమెను సూప‌ర్ సోల్జ‌ర్‌లా పెంచి పెద్ద చేస్తాడు ఆర్మీ ఆఫీస‌ర్ ఫ‌తే సింగ్‌. అల్ఫా సీర‌మ్ వ‌ల్ల సీత‌కు అసాధార‌ణ శ‌క్తులు వ‌స్తాయి. భార‌త ప్ర‌భుత్వంలోని ఉన్నాధికారుల‌ను సీత చంపుతుంటుంది. ఆమె లిస్ట్‌లో విక్రాంత్ కౌల్ ఉంటాడు. విక్రాంత్‌ను చంపాల‌నే ప్ర‌య‌త్నంలో ఫ‌తే సింగ్ గురించి సీత‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? త‌ను తండ్రిలా భావించే అత‌డికే ఎందుకు ఎదురుతిరిగింది? ఆమె పోరాటానికి అండ‌గా దుర్గ ఎవ‌రు? సీత‌కు ఆమెతో ఉన్న సంబంధ‌మేమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement