త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alia Bhatt | అడ‌ల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా అలియాభ‌ట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ప్రొడ్యూస‌ర్‌గా అవ‌తారం ఎత్తింది. ఓ అడ‌ల్డ్ కామెడీ సినిమాను నిర్మించింది. డోంట్ బీ షై పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Aug 24, 2026, 7.31 pm IST

Alia Bhatt | అడ‌ల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా అలియాభ‌ట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌
Advertisement

Alia Bhatt | బాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న అలియాభ‌ట్‌కు సినిమా నిర్మాణం మాత్రం అంత‌గా అచ్చిరాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు జిగ్రాతో పాటు డార్లింగ్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసింది. జిగ్రా అలియాభ‌ట్‌కు యాభై కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. డార్లింగ్స్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. మ‌రోసారి ప్రొడ్యూస‌ర్‌గా ఈ బాలీవుడ్ బ్యూటీ అవ‌తార‌మెత్తింది. త‌న రూటు మార్చి ఈ సారి అడ‌ల్ట్ కామెడీ సినిమాను నిర్మించింది. డోంట్ బీ షై పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సోద‌రి షాహీన్ భ‌ట్‌తో క‌లిసి అలియా భ‌ట్ నిర్మిస్తోంది.

నేరుగా ఓటీటీలోకి....

డోంట్ బీ షై మూవీ కూడా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. సెప్టెంబ‌ర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ...

డోంట్ బీ షై మూవీకి శ్రిష్టీ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఈ సినిమా ద్వారా రెండు జంట‌లు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాయి. ఆరుషీ బ‌జాస్‌, అన్ష్ దుగ్గ‌ల్‌, బినాకా అరోరా, పీయూష్ కాఠీ హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. వీరితో పాటు కునాల్ రాయ్ క‌పూర్‌, అనురాగ్ బ‌సు, నేహా ధుపియా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

బ్రేక‌ప్ స్టోరీస్‌...

టీనేజ్‌ ల‌వ్‌స్టోరీలు, బ్రేక‌ప్‌లు, జీవితంలో స్థిర‌ప‌డే క్ర‌మంలో ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ల‌తో న్యూ ఏజ్ అడ‌ల్ట్ కామెడీగా ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అలియాభ‌ట్ గెస్ట్ రోల్‌లో క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం అలియాభ‌ట్ బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. ల‌వ్ అండ్ వార్‌తో పాటు తుంబాద్ 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. అలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టించిన గ‌త మూవీ అల్ఫా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.
బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ప్రొడ్యూస‌ర్‌గా అవ‌తారం ఎత్తింది. ఓ అడ‌ల్డ్ కామెడీ సినిమాను నిర్మించింది. డోంట్ బీ షై పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

Advertisement
Advertisement