త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | విజ‌య్ జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్‌.. జ‌న‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి?

Jana Nayagan Movie | త‌మిళ స్టార్ హీరో, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజయ్‌ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan Movie) సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

G

Movies | Published On Jan 9, 2026, 1.07 pm IST

Jana Nayagan | విజ‌య్ జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్‌.. జ‌న‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి?
Advertisement

త్రినేత్ర.న్యూస్ : త‌మిళ స్టార్ హీరో, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజయ్‌ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan Movie) సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. విజ‌య్ చివ‌రి చిత్రంగా ప్ర‌చారంలో ఉన్న జ‌న నాయ‌గ‌న్‌.. షెడ్యూల్ ప్రకారం జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సి ఉన్న‌ది. అయితే సెన్సార్ స‌ర్టిఫికెట్ ఆల‌స్య‌మ‌వ‌డంతో రిలీజ్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

గత డిసెంబరులో ఈ సినిమాను సెన్సార్‌ కోసం పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్‌ చేయాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తున్న‌ది. దీంతో చిత్ర బృందం మార్పులు చేసి మళ్లీ సెన్సార్‌కు పంపగా బోర్డు నుంచి ఎలాంటి స్పంద‌న‌ రాలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ‌ కేవీఎన్‌ ప్రొడక్షన్ మద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించింది. తొలుత యూ/ఏ సర్టిఫికేషన్‌కు సిఫార్సు చేసిన సెన్సార్‌ బోర్డు.. అనంత‌రం రివ్యూ కమిటీకి పంపిందని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. శుక్ర‌వారం తీర్పును వెలువ‌రించింది.

దీంతో సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తున్న‌ది. దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉన్న‌ది. కాగా, బుధ‌వారం వ‌ర‌కు బుక్ మై షో వేదిక‌గా 4.50 ల‌క్ష టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అమ్ముడ‌య్యాయి. అయితే సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌టంతో ఆ టికెట్ల‌కు సంబంధించిన మొత్తాన్ని సంస్థ వెన‌క్కి ఇచ్చే ప్ర‌క్రియ ప్రారంభించింది. దీంతో ఇది బుక్ మై షో చ‌రిత్ర‌లో అత్య‌దిక రిఫండ్ అని ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement