Jana Nayagan | దళపతి విజయ్ జన నాయగన్ విడుదల వాయిదా..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన భారీ చిత్రం జన నాయగన్ (Jana Nayagan) విడుదల వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ప్రకటిచింది.
Entertainment | Published On Jan 8, 2026, 6.46 am IST
trinethra.news | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన భారీ చిత్రం జన నాయగన్ (Jana Nayagan) విడుదల వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బుధవారం రాత్రి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటిచింది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో జన నాయగన్ ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరిగింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీకరణ పత్రం అందకపోవడంతో చిత్రబృందం కోర్డును ఆశ్రయించింది. జనవరి 9న న్యాయస్థానం నుంచి తుది ఉత్తర్వులు రానుండటంతో సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితుల కారణంగా జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తాం. అప్పటివరకు అంతా ఓపికతో ఉండండి. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం. అంటూ నిర్మాణ సంస్థ టీవీకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఉద్దేశపూర్వక జాప్యం..!
కాగా, సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీలో జరుగుతున్న జాప్యంపై తమిళగ వెట్రి కజగం (TVK) డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. డిసెంబర్ 19న సినిమాను సెన్సార్ కమిటీకి చూపించాం. అయినప్పటికీ ఇంకా ధ్రువీకరణ పత్రం జారీ చేయలేదని మండిపడ్డారు. ఇది కేవలం సాంకేతిక కారణంగా ఆలస్యం జరుగడం లేదని, ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారన్నారు. దీన్ని రాజకీయం చేయాలని తమ పార్టీ కోరుకోలేదని, ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మూవీని తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల చేస్తుండగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఇంకా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలుకాలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



