BCCI | భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమన్న బీసీబీ.. బీసీసీఐ కార్యదర్శి సైకియా రెస్పాన్స్ ఇదే..!
BCCI | త్వరలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత్‌లో మ్యాచులు తాము ఆడబోమని బీసీబీ పట్టుదలతో ఉన్నది. ఈ క్రమంలో ఐసీసీకి లేఖ సైతం రాసింది. బీసీసీఐ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.
BCCI | త్వరలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత్‌లో మ్యాచులు తాము ఆడబోమని బీసీబీ పట్టుదలతో ఉన్నది. ఈ క్రమంలో ఐసీసీకి లేఖ సైతం రాసింది. బీసీసీఐ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మౌనం వీడారు. వాస్తవానికి బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో వివాదం మొదలైంది.
టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్నది. బంగ్లాదేశ్‌లో తన గ్రూప్ దశ మ్యాచులు నాలుగింటిని భారత్‌లోనే ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి కోల్‌కతా, మరొకటి ముంబయిలో ఉంది. ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్‌లో తాము సైతం పాక్ తరహాలోనే భారత్‌లో ఆడబోమని పేర్కొంది. ఆటగాళ్ల భద్రతను సాకుగా చూపుతున్నది. ఇటీవల రెండోసారి బీసీబీ ఐసీసీకి అధికారిక లేఖ రాసింది. అయితే, ఇప్పటి వరకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
టీ20 ప్రపంచ కప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి మరో శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరుతున్నా బీసీసీఐ పెద్దగా పట్టించుకోవడం లేదని. బీసీసీఐ అధికారులు శుక్రవారం ముంబయిలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ డిమాండ్‌పై ఎలాంటి చర్చ జరుగలేదని బీసీసీఐ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ అంశంపై తుది నిర్ణయం ఐసీసీ మాత్రమే తీసుకోవాలని, తమ పరిధిలో లేదన్నారు.
గత నెలలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ జట్టు రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ బంగ్లాదేశ్ బౌలర్‌ను జట్టు నుంచి తప్పించింది. ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకోవడం భారత్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నేతలు బీసీసీఐతో పాటు కేకేఆర్‌పై విమర్శలు గుప్పించారు. తమ బౌలర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్ విధించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






