Aishwarya Rai Bachchan | ఐశ్వర్య కేన్స్ లుక్‌పై విమర్శలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్
Aishwarya Rai Bachchan | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) కేన్స్ లుక్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆమె ఫ్యాషన్, స్టైల్‌ను అభినందిస్తుండగా, మరికొందరు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఐష్ వెయిట్‌పై కూడా బాడీ షేమింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ట్రోలర్స్‌కు బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) గట్టి కౌంటర్ ఇచ్చారు.
Aishwarya Rai Bachchan | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటారు. ఏటా ఫ్రాన్స్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు కొత్త కళ తెస్తుంటారు ఐశ్వర్య. ఆమె రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ (Aish)వైపే ఉంటాయి. ఈ ఏడాది కూడా కేన్స్‌లో ఐశ్వర్య సందడి చేశారు.
ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘లోరియల్’ (LOreal)కు బ్రాడ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఐష్.. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన ‘లుమినారా’ అనే డీప్ సఫైర్-బ్లూ గౌన్‌లో మెరిసిపోయారు. దీంతోపాటు వైట్ డ్రెస్‌లో కూడా ఐష్ అందరి దృష్టిని ఆకర్షించారు. రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఐశ్వర్య కేన్స్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఐశ్వర్య కేన్స్ లుక్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆమె ఫ్యాషన్, స్టైల్‌ను అభినందిస్తుండగా, మరికొందరు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఐష్ వెయిట్‌పై కూడా బాడీ షేమింగ్ కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో ట్రోలర్స్‌కు బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫ్యాషన్, స్టైల్ అనేవి తమ ఇష్టానికి తగ్గట్టు సొంతంగా వ్యక్తం చేసేవి అని అన్నారు. దీనిపై ఏ మహిళ కూడా ఎవరికీ ఎటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేన్స్‌లో ఐశ్వర్య చాలా అద్భుతంగా ఉన్నారంటూ ప్రశంసించారు. ఆమెను వేరేలా చూడాలనుకునే వారు మొదట మీ దగ్గర ఏముందో ఎందుకు చూపించకూడదు..? అని ప్రశ్నించారు. ఆమె అక్కడ మిమ్మల్ని మెప్పించడానికి లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెడ్ కార్పెట్‌పై వయసు పైబడిన మహిళలను చూడటం మీకు అలవాటు లేకపోతే.. ఇప్పటికైనా అలవాటు చేసుకోండి అంటూ కంగన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఐశ్వర్య రాయ్ కేన్స్ లుక్ ఫొటోను చేశారు.
View this post on Instagram
Also Read..
ఇది మీకు తెలుసా?.. వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం..
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడతారంటే?.. షెడ్యూల్ ఇదే..
నేడు పద్మ పురస్కారాల ప్రదానం.. 66 మందికి అందజేయనున్న రాష్ట్రపతి
సంబంధిత వార్తలు

Kangana Ranaut | మెడలో తాళితో కంగనా రనౌత్ – సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? – నెటిజన్ల కామెంట్లు వైరల్
మే 22, 2026

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై చీరకట్టులో మరాఠీ హీరోయిన్ సందడి
మే 18, 2026
తాజావార్తలు
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..



