Padma Awards | నేడు పద్మ పురస్కారాల ప్రదానం.. తెలంగాణ నుంచి వీరికే..
Padma Awards | దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. గణతంత్ర మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ఎంపికైనవారికి పురస్కారాలు అందజేస్తారు.
Padma Awards | త్రినేత్ర.న్యూస్: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. గణతంత్ర మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ఎంపికైనవారికి పురస్కారాలు అందజేస్తారు. 2026కుగాను మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. వీరిలో తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు.
తొలి విడతలో భాగంగా 66 మందికి పద్మ అవార్డులను అందజేయనున్నారు. ఇందులో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మిగిలిన వారికి త్వరలో నిర్వహించే రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
తెలంగాణ నుంచి..
- చంద్రమౌళి గడ్డమనుగు (సైన్స్–ఇంజినీరింగ్)
- దీపికా రెడ్డి (కళలు)
- గూడూరు వెంకట్ రావు (వైద్యం)
- కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ (సైన్స్–ఇంజినీరింగ్)
- కుమారస్వామి తంగరాజ్ (సైన్స్–ఇంజినీరింగ్)
- పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం)
- మామిడి రామారెడ్డి (మరణానంతరం – ఇతర రంగాలు)
యూజీసీ మాజీ చైర్మన్, నల్లగొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్‌కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ అవార్డు దక్కింది. అదేవిధంగా సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ (కళలు)కు ఆంధ్రప్రదేశ్ కోటాలో పద్మ పురస్కారాలు లభించాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు




