Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
Lava SHARK 2 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన తాజా బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ షార్క్ 2 5జీని విడుదల చేసింది. 2025లో కంపెనీకి అత్యధిక అమ్మకాలు తీసుకొచ్చిన సిరీస్‌కు ఇది సక్సెసర్‌గా వచ్చింది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
Technology | Published On May 26, 2026, 1.52 pm IST
Lava SHARK 2 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన తాజా బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ షార్క్ 2 5జీని విడుదల చేసింది. 2025లో కంపెనీకి అత్యధిక అమ్మకాలు తీసుకొచ్చిన సిరీస్‌కు ఇది సక్సెసర్‌గా వచ్చింది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండగా, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. లావా షార్క్ 2 5జీ ఫోన్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేని ఇచ్చారు. ఇది 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ డిస్‌ప్లే ద్వారా యూట్యూబ్ వీడియోలను సుమారు 13 గంటల 35 నిమిషాల పాటు వీక్షించవచ్చు. అలాగే నిరంతర స్క్రీన్-ఆన్ టైమ్ దాదాపు 12 గంటల 23 నిమిషాలు ఉంటుందని తెలిపింది.
భారీ బ్యాటరీ..
ఫోన్‌కు ఐపీ64 రేటింగ్ కూడా ఇచ్చారు. దీంతో డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ డివైస్ సోనార్ గోల్డ్, ఆర్యా బ్లూ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఆక్టా-కోర్ యూనిసాక్ టి8200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ ఆంటుటు 11 బెంచ్‌మార్క్‌లో 5 లక్షలకు పైగా స్కోర్ సాధించిందని లావా వెల్లడించింది. రోజువారీ మల్టీటాస్కింగ్, మీడియా వినియోగానికి మంచి పనితీరు అందిస్తుందని చెబుతోంది. ఇందులో 4జీబీ ర్యామ్ ను ఇవ్వగా, ర్యామ్‌ను అదనంగా మరో 4జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. అందువల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక 64జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 6000 ఎంఏఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఇందులో ఉంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
క్లీన్ ఓఎస్, ఏఐ కెమెరా..
ఈ ఫోన్‌లో క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌ను ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఎలాంటి బ్లోట్‌వేర్ లేదని, వినియోగదారులకు ప్రకటనలు కూడా కనిపించవని తెలిపింది. అందువల్ల యూజర్లకు క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం లభిస్తుందని పేర్కొంది. ఫోన్‌కు వెనుక వైపు 13 మెగాపిక్సల్ సింగిల్ కెమెరాను ఇచ్చారు. ఇది ఏఐ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. 5జి సేవలను ఇందులో ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
ధర వివరాలు..
లావా షార్క్ 2 5జీ ఫోన్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను జూన్ 10 నుంచి దేశవ్యాప్తంగా లావా రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. అలాగే కంపెనీ ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్‌ను కూడా ఈ ఫోన్‌కు అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులకు ఇంటి వద్దనే ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ లభిస్తుంది.
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!
- ●Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ - రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!
- ●AIADMK MLA | అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. నాలుగో ఎమ్మెల్యే కూడా..
- ●KTR | T-Works ఒక భవనం కాదు.. యువత కలల ప్రయోగశాల: కేటీఆర్

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..

Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ - రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!




