Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
Deepak Bagla | భారతీయులకు సాధారణంగానే పని పూర్తి చేసే సామర్థ్యం అధికంగా ఉంటుందని, అది మన మైండ్ సెట్‌లోనే ఉందని, అలాగే పూర్తిగా ఏమీ తెలియని పరిస్థితుల్లోనూ పనిచేసే సత్తా ఉంటుందని, అందుకనే ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్పొరేట్, ఐటీ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా సేవలు అందిస్తున్నారని నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా అన్నారు.
Deepak Bagla | భారతీయులకు సాధారణంగానే పని పూర్తి చేసే సామర్థ్యం అధికంగా ఉంటుందని, అది మన మైండ్ సెట్‌లోనే ఉందని, అలాగే పూర్తిగా ఏమీ తెలియని పరిస్థితుల్లోనూ పనిచేసే సత్తా ఉంటుందని, అందుకనే ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్పొరేట్, ఐటీ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా సేవలు అందిస్తున్నారని నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా అన్నారు. ఎన్డీటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన లెర్న్ నెక్ట్స్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతీయ సీఈవోలు ప్రపంచస్థాయిలో ఎలా ఎదిగారనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రధాన బలాన్ని, ప్రపంచ కంపెనీలను నడిపిస్తున్న భారతీయులలో చూడవచ్చని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో జరిగిన రౌండ్‌టేబుల్ చర్చను గుర్తుచేసుకుంటూ, భారతీయ సీఈవోలు అంతర్జాతీయంగా ఎందుకు అత్యుత్తమంగా రాణిస్తున్నారని ప్రపంచ నాయకులను అడిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అందుకనే సీఈవోలు అవుతున్నారు..
మొదటి విషయం పని పూర్తి చేసే సామర్థ్యం అని, అది ఒక మైండ్‌సెట్ అని ఆయన అన్నారు. రెండోది ఎలాంటి ప్లేబుక్ లేకుండా పూర్తిగా తెలియని పరిస్థితుల్లో కూడా పని చేయగల సామర్థ్యం అని, మనం ఏదో ప్రత్యేకంగా చేసినందువల్లే ఆ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచం భారీ మార్పులను ఎదుర్కొంటోందని, అందుకు అనుగుణంగా విద్యా వ్యవస్థలు కూడా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 1960లలో వచ్చిన ఒక పుస్తకాన్ని ఉదహరిస్తూ, భవిష్యత్తులో విజయవంతమైన వ్యక్తి అన్ని సమాధానాలు తెలిసినవాడు కావల్సిన అవసరం లేదని, సరైన ప్రశ్నలు అడగడం తెలిసినవాడు అయితే చాలని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు ఆ విషయం పూర్తిగా అర్థం కాలేదని, కానీ ఇప్పుడు ప్రపంచం అదే దిశగా ప్రయాణిస్తుందని, అందుకు ఏఐ ఉదాహరణ అని చెప్పారు.
ఇది ఆందోళనలతో నిండిన తరం..
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) ప్రస్తుతం కాంటెక్స్ట్‌తో కూడిన లెర్నింగ్ వైపు విద్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇండస్ట్రియల్ రివల్యూషన్ కాలంలో రూపొందిన విద్యా విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, కానీ ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. మనం 300 సంవత్సరాల ఇండస్ట్రియల్ రివల్యూషన్‌ను చూశామని, ఆ తరువాతే మొత్తం విద్యా, ట్రైనింగ్ వ్యవస్థ రూపుదిద్దుకుందని అన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బాగ్లా తెలిపారు. కార్యక్రమంలో ముందుగా జరిగిన మరో ప్యానెల్ చర్చలో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ, నేటి యువతను ఆయన ఆంక్సైటీ జనరేషన్ గా అభివర్ణించారు. ఇది ఆందోళనలతో నిండిన తరం అని ఆయన అన్నారు. ప్రస్తుతం సమాచార ప్రవాహం, విద్యా వ్యవస్థ ఎంతో క్లిష్టంగా మారిందని, అది విద్యార్థులతోపాటు వారికి మార్గనిర్దేశం చేసే తల్లిదండ్రులు, మెంటార్లకు కూడా సవాల్‌గా మారిందని అన్నారు.
నైపుణ్యం కలిగిన తరం కావాలి..
ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం, భవిష్యత్ భారత్‌కి అవసరమైన తదుపరి తరాన్ని సిద్ధం చేయడమేనని, తెలియని పరిస్థితుల్లో కూడా తమ దారిని స్వయంగా నిర్మించుకునే సామర్థ్యం, కొత్త పరిస్థితులను అంగీకరించి వాటికి అనుగుణంగా మారే నైపుణ్యం కలిగిన తరం కావాలని ఆయన అన్నారు. ఇన్నోవేషన్ ఆధారిత కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, ప్రధాని మోదీ విజన్ కింద 2016 ఫిబ్రవరిలో ప్రారంభమైన అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను కూడా బాగ్లా ప్రస్తావించారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధారంగా నడిచే సమాజానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్, బలమైన పునాదిని ఎలా నిర్మించాలన్నదే అప్పటి ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.
తాజావార్తలు
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!
- ●Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ - రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..

Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..





