త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranaut | మెడ‌లో తాళితో కంగ‌నా ర‌నౌత్ – సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? – నెటిజ‌న్ల కామెంట్లు వైర‌ల్‌

మెడ‌లో తాళిబొట్టు, చేతికి మ‌ట్టి గాజులు, నుదుట‌న బొట్టుతో కంగ‌నా క‌నిపించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కంగ‌నా ఎవ‌రికి చెప్ప‌కుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.

N

Entertainment | Published On May 22, 2026, 2.39 pm IST

Kangana Ranaut |  మెడ‌లో తాళితో  కంగ‌నా ర‌నౌత్ – సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?  – నెటిజ‌న్ల కామెంట్లు వైర‌ల్‌
Advertisement

Kangana Ranaut |  కంగ‌నా ర‌నౌత్ బాలీవుడ్‌లో ఓ పెద్ద‌ హిట్టు అందుకొని ప‌దేళ్లు దాటిపోయింది. 2015లో వ‌చ్చిన త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ త‌ర్వాత కంగ‌న హీరోయిన్‌గా న‌టించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటోన్న కంగ‌నా గ‌త కొన్నేళ్లుగా లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. స‌క్సెస్‌లు లేక‌పోయినా వివాదాలు, పాలిటిక్స్‌తో ఈ బాలీవుడ్ బ్యూటీ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా పెళ్లి పుకార్ల‌తో కంగ‌నా ర‌నౌత్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

తాళిబొట్టుతో..

ఇటీవ‌లే కంగ‌నా ర‌నౌత్ త‌న ఇంటి బ‌య‌ట క‌నిపించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో మెడ‌లో తాళిబొట్టు... చేతికి గ్రీన్ క‌ల‌ర్ మ‌ట్టి గాజులు, నుదుట‌న బొట్టు ధ‌రించి ఈ బాలీవుడ్ హీరోయిన్‌ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కంగ‌నా మెడ‌లో తాళిబొట్టు ఉండ‌టం హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి కానీ అమ్మాయిలు మంగ‌ళ‌సూత్రం ధ‌రించ‌రు కాబ‌ట్టి కంగ‌నాకు పెళ్ల‌య్యిందా? ఎవ‌రికి చెప్ప‌కుండా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు ఓ అడుగు ముందుకు వేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కంగ‌నాకు విషెస్ చెబుతున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

అస‌లు ట్విస్ట్ ఇదేనా?

కంగ‌నా పెళ్లి చేసుకుంది నిజ‌మే కానీ. రియ‌ల్ లైఫ్‌లో కాద‌ట‌. రీల్ లైఫ్‌లోన‌ట‌. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ క్వీన్ 2 సినిమా చేస్తోంది. ఇందులో గృహిణిగా కంగ‌నా క‌నిపించ‌బోతున్న‌ద‌ట‌ ఈ సినిమా షూటింగ్ కోస‌మే మంగ‌ళ‌సూత్రం, మ‌ట్టిగాజులు ధ‌రించి సెట్స్‌కు బ‌య‌లుదేరింద‌ట‌. క్వీన్ 2 లుక్‌కు సంబంధించిన వీడియో ఇద‌ని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. కంగ‌నా హీరోయిన్‌గా 2013లో వ‌చ్చిన క్వీన్ మూవీకి సీక్వెల్‌గా క్వీన్ 2 తెర‌కెక్క‌నుంద‌ట‌. క్వీన్ సినిమాకుగాను బెస్ట్ యాక్ట‌ర్‌గా కంగ‌నా ర‌నౌత్ నేష‌న‌ల్ అవార్డు అందుకుంది. ఈ సీక్వెల్‌కు వికాల్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement