త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Driver | వ‌డ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను తీసేశారు..

RTC Driver | రైతుల క‌ష్టాల‌ను, న‌ష్టాల‌ను చూసి ఉండ‌లేక డ్యూటీలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ వ‌డ్లు కొనండ‌ని మంత్రికి సూచించాడు. అలా చెప్ప‌డ‌మే ఆయ‌న చేసిన పాప‌మైంది. వెంట‌నే ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇంతంకి ఏం జ‌రిగిందంటే..

S

Telangana | Published On May 26, 2026, 1.56 pm IST

RTC Driver | వ‌డ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను తీసేశారు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: రైతుల క‌ష్టాల‌ను, న‌ష్టాల‌ను చూసి ఉండ‌లేక డ్యూటీలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ వ‌డ్లు కొనండ‌ని మంత్రికి సూచించాడు. అలా చెప్ప‌డ‌మే ఆయ‌న చేసిన పాప‌మైంది. వెంట‌నే ఉద్యోగంలో నుంచి తీసేశారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇంతంకి ఏం జ‌రిగిందంటే..

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్య‌తిరేకంగా మంగ‌ళ‌వారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగిత్యాలలో ర్యాలీ నిర్వ‌హించి ధర్నా చేస్తున్నారు. జ‌గిత్యాల డిపోన‌కు చెందిన‌ అద్దె బస్ ప్రైవేట్ డ్రైవర్‌గా ప‌ని చేస్తున్న అశోక్‌ (Ashok) అదే స‌మ‌యంలో అక్క‌డి నుంచి డ్యూటీలో వెళ్తున్నాడు. ఈ ధ‌ర్నాను చూసిన అశోక్ బ‌స్సును నెమ్మ‌దిగా పోనిస్తూ “పెట్రోల్ కాదు.. ముందు వడ్లు, మక్కల కోసం మాట్లాడండి” అని అక్క‌డున్న మంత్రి, ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ విష‌యం డీఎంకు తెలియ‌డంతో వెంట‌నే రిమూవ‌ల్ లెట‌ర్ పంపించారు. ఇక డ్యూటీకి రావొద్ద‌ని సూచించారు.

ఆవేద‌న‌తోనే అన్నాను.. కానీ ఎవ‌రినీ విమ‌ర్శించ‌లేదు: డ్రైవ‌ర్‌ అశోక్‌

ఈ ఘ‌ట‌న‌పై అశోక్ మాట్లాడుతూ త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కాడు. తాను ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదు. రైతుల నష్టాలపై ఆవేదనతోనే మాట్లాడాను. కేవ‌లం రైతుల గురించే అన్నాను. ఆర్‌ఎం నుంచి రిమూవ్ లెటర్ వచ్చింది. 5 డిపోల్లో డ్యూటీ ఇవ్వొద్దని ఆదేశాలున్నాయి. డ్యూటీకి రావొద్దని జగిత్యాల డీఎం చెప్పారు అని వివ‌ర‌ణ ఇస్తూ అశోక్ ఆవేద‌న చెందాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement