Kangana Ranaut | కేంద్ర మంత్రితో బాలీవుడ్ నటి ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
Kangana Ranaut | బీజేపీ ఎంపీ, బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)తో కంగనా రనౌత్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
Kangana Ranaut | బీజేపీ ఎంపీ, బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)తో కంగనా రనౌత్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో ఎంతో క్లోజ్‌గా కనిపించడమే ఈ రూమర్స్‌కు కారణం. పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా వీరిద్దరూ జంటగా పలుసార్లు కెమెరాకు చిక్కారు. పలు ఈవెంట్స్‌కు కూడా కలిసే హారయ్యారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఈ యువ ఎంపీలు ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ ప్రచారం మొదలైంది.
ఈ రూమర్స్‌పై బాలీవుడ్ క్వీన్ కంగన తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి రొమాన్స్ లేవని వెల్లడించారు. చిరాగ్ తనకు చాలా ఏళ్ల నుంచే తెలుసని.. గతంలో కలిసి ఓ సినిమా కూడా చేసినట్లు వివరించారు. ఒకవేళ తమ మధ్య నిజంగానే ఏదైనా సంబంధం ఉండి ఉంటే.. ఈపాటికి పిల్లలు కూడా ఉండేవారు అంటూ కంగన తనదైన శైలిలో రూమర్స్‌కు బదులిచ్చారు. తామిద్దరం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లం కావడం వల్ల ఒకరి పట్ల ఒకరికి గౌరవం, స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని ఆమె వివరించారు.
కాగా, 2011లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘మిలే నా మిలే హమ్’ (Miley Naa Miley Hum) అనే సినిమాతో చిరాగ్ పాశ్వాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కంగనా రనౌతే హీరోయిన్. ఆ సినిమాతోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఒకే పార్టీకి సంబంధించిన వారు కావడంతో ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది. ఇక పార్లమెంట్ ఆవరణలో వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు కూడా ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ జరుగుతోందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read..
అదిరిపోయే సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్లు
నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్న సీఎం రేవంత్: హరీశ్ రావు
పాపం ప్రతాప్ రివ్యూ - తిరువీర్ బోల్డ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
సంబంధిత వార్తలు

Kangana Ranaut on Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ ‘మ్యాజిక్’ వ్యాఖ్యల దుమారం: ఆయన ప్రసంగం వినడం పెద్ద తలనొప్పి అన్న కంగనా రనౌత్
ఏప్రిల్ 17, 2026

Eetela Rajendar | కేసీఆర్ నన్ను గెంటేశారు.. లేదంటే డిప్యూటీ సీఎం అయ్యేటోన్ని: ఈటెల
ఏప్రిల్ 5, 2026

Kangana Ranaut | హద్దులన్నీ దాటేస్తారా? బాలీవుడ్‌కు సిగ్గు లేదా? – కంగనా రనౌత్ ఫైర్
మార్చి 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



