Kangana Ranaut | హద్దులన్నీ దాటేస్తారా? బాలీవుడ్‌కు సిగ్గు లేదా? – కంగనా రనౌత్ ఫైర్
నోరా ఫతేహి సర్కే చునార్ సాంగ్‌పై బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ అయ్యింది. అశ్లీలత, అసభ్యత విషయంలో బాలీవుడ్ హద్దులన్నీ దాటేస్తోందని అన్నది. దేశం మొత్తం వారిని తప్పుపడుతోన్న సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నది.
Entertainment | Published On Mar 17, 2026, 4.37 pm IST
Kangana Ranaut | బాలీవుడ్ సినీ పరిశ్రమపై కంగనా రనౌత్ నిప్పులు చెరిగింది. అశ్లీలత, అసభ్యత విషయంలో హద్దులన్నీ దాటేస్తోందని అన్నది. కేడీ ది డెవిల్ మూవీ నుంచి ఇటీవల సర్కే చునార్ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాహిత్యం, స్టెప్పులపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. అమ్మాయిలను అసభ్యంగా వర్ణిస్తూ డబుల్ మీనింగ్‌లతో పాటలోని పదాలు వినిపించాయి. నోరా ఫతేహి పదే పదే పైట జారేయడం, అశ్లీల స్టెప్పులపై సినీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాటను రిలీజ్ చేశారు. తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో ద్వందార్థాలు, అశ్లీల పదాలతోనే ఈ పాట ఉందని అంటున్నారు.
సంజయ్‌దత్, నోరా ఫతేహి...
సర్కే చునార్ పాట బాలీవుడ్‌లోనూ వివాదాస్పదమయ్యింది. ఈ పాటలో సంజయ్‌దత్, నోరా ఫతేహి నటించారు. వారిని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా అంటూ కడిగిపడేస్తున్నారు. కాగా ఈ పాటపై బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా మండిపడ్డారు.
దిగజారిపోతుంది...
బాలీవుడ్‌లో అశ్లీల కంటెంట్ పెరిగిపోయిందని అన్నది. ఆడియెన్స్ అటెన్షన్ విషయంలో రోజురోజుకు హిందీ సినీ పరిశ్రమ దిగజారిపోతుందని చెప్పింది. అసభ్యత విషయంలో హద్దులన్నీ దాటేస్తోన్నారని తెలిపింది. "ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల బాలీవుడ్ ప్రతిష్ట మనసకబారుతోంది. దేశం మొత్తం వారిని విమర్శిస్తున్నారు. తప్పులను ఎత్తిచూపుతున్నారు. అయినా బాలీవుడ్ వర్గాలకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదు. ఏం పట్టనట్లుగానే ఉంటున్నారు.అశ్లీల కంటెంట్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి పాటలు రావడానికి తక్కువగా ఆస్కారం ఉంటుంది" అని కంగనా అన్నది. కంగనా కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. మరికొంత మంది మాత్రం కంగనాను విమర్శిస్తున్నారు. హీరోయిన్‌గా నువ్వు కూడా ఇలాంటి పాటల్లో నటించావు కదా...అప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా అంటూ కామెంట్స్, ట్వీట్స్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



