Met Gala 2026 | గోల్డ్ శారీ, డైమండ్స్ బ్లౌజ్.. మెట్‌గాలాలో ఈషా అంబానీ మెరుపులు
Met Gala 2026 | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఈషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో డిఫరెంట్ లుక్‌లో అందరినీ ఆకర్షించారు. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో మెరిసిపోయారు. ఈవెంట్‌లో ఈషా ధరించిన బ్లౌజ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Met Gala 2026 | ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) మెట్ గాలా (Met Gala) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art)లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు.
భారత్ నుంచి ప్రియాంక చోప్రా (Priyanka Chopra), దీపికా పదుకొణె (Deepika Padukone), ఈషా అంబానీ (Isha Ambani), అలియా భట్ (Alia Bhatt), షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కియారా అడ్వాణీ (Kiara Advani), సింగర్ దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలాతోపాటు తదితర నటీనటులు ఇప్పటివరకూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ ఏడాది కూడా మెట్‌గాలా (Met Gala 2026) గ్రాండ్‌గా ప్రారంభమైంది. మే 4న ప్రారంభమైన ఈ వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల కుమార్తె ఈషా అంబానీ హాజరై రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో మెరిసిపోయారు.
ఇషా చీర ప్రత్యేకత..
ఈషా ధరించిన ఈ చీరపై చేతితో గీసిన పిచ్వాయ్ (Pichwai) శైలి మోటిఫ్‌లు, గౌరవ్ గుప్తా సిగ్నేచర్ స్టైల్ అయిన స్కల్ప్చరల్ కేప్ (sculptural cape) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిలయన్స్ రిటైల్ ప్రారంభించిన కళాకారుల బ్రాండ్ 'స్వదేశ్' కు చెందిన నిపుణులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు తీగలతో నేయడం విశేషం.

వజ్రాల బ్లౌజ్..
ఈ ఈవెంట్‌లో ఈషా ధరించిన బ్లౌజ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లౌజ్‌పై రియల్ డైమండ్స్‌ను పొందుపరిచారు. బ్లౌజ్ వెనుక భాగంలో నిజాం నవాబుల నగల సేకరణలోని అత్యంత అద్భుతమైన, చారిత్రాత్మకమైన 'సర్ పేచ్' (Sarpech)ను అమర్చడంతో దాని అందం మరింత రెట్టింపైంది. ఆ బ్లౌస్ మొత్తం తన తల్లి నీతా అంబానీ నగలతో తయారు చేసినట్లు ఈషా ఈ సందర్భంగా తెలిపారు.

1800 క్యారెట్లకు పైగా వజ్రాలతో..
ఈ బ్లౌజ్‌ను ఎమరాల్డ్స్ (పచ్చలు), పోల్కీ, కుందన్‌లతో పాటు 1800 క్యారెట్లకు పైగా వజ్రాలతో డిజైన్ చేసినట్లు డిజైనర్ గౌరవ్ గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.

మ్యాంగో సంచి..
దుస్తులు, నగలే కాదు.. ఈషా చేతిలోని మ్యాంగో స్కల్ప్చర్ అందరినీ ఆకర్షించింది. ప్రముఖ కళాకారుడు సుబోధ్ గుప్తా రూపొందించిన ఒక మామిడి పండు శిల్పాన్ని (mango sculpture) ఆమె క్రోచెట్ బ్యాగ్‌లో తీసుకువెళ్లారు. ఇది భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలవడమే కాకుండా.. ఈ ఏడాది మెట్ గాలా థీమ్ అయిన ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ (Fashion is Art)కు నిలువెత్తు రూపంగా నిలిచింది. తన స్టైల్, దుస్తులు, నగలతో ‘మెట్ గాలా-2026’ ఈవెంట్‌లో చూపులన్నీ అంబానీల కూతురు ఈశా మీదే పడ్డాయి.






Also Read..
రెండు మంత్రి పదవులు ఇస్తేనే మద్దతు.. విజయ్‌కి కాంగ్రెస్ షరతు!
ఇన్‌స్టాలో ఇక ఏఐ కంటెంట్‌ను గుర్తించడం ఈజీ.. అసలైన క్రియేటర్లకు గుర్తింపు..
బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఆరు ఫర్నీచర్ షాపులు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






