త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | బాచుప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం.. కాలిబూడిదైన ఆరు ఫ‌ర్నీచ‌ర్ షాపులు

ire Accident | హైద‌రాబాద్‌లోని బాచుపల్లిలో (Bachupally) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జ‌రిగింది. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌-బాచుపల్లి ప్రధాన రహదారిలో ఉన్న మై స్పేస్ స‌మీపంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

G

Hyderabad | Published On May 5, 2026, 10.18 am IST

Fire Accident | బాచుప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం.. కాలిబూడిదైన ఆరు ఫ‌ర్నీచ‌ర్ షాపులు
Advertisement

Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని బాచుపల్లిలో (Bachupally) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జ‌రిగింది. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌-బాచుపల్లి ప్రధాన రహదారిలో ఉన్న మై స్పేస్ స‌మీపంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో 6 ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపు చేశారు. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిపోయింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు.

ఒక్కో షాప్‌లో సుమారు రూ. 3 లక్షల విలువైన సామగ్రి ఉందని బాధితులు వాపోతున్నారు. కాగా, ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా జరిగిందా?, దుండ‌గులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement