Tamil Nadu | రెండు మంత్రి పదవులు ఇస్తేనే మద్దతు.. విజయ్‌కి కాంగ్రెస్ షరతు!
Tamil Nadu | తమిళనాడులో (Tamil Nadu) అతిపెద్ద పార్టీగా అవతరించి టీవీకే (TVK).. ప్రభుత్వ ఏర్పాటుకు స్పీడ్ పెంచింది. తమతో కలిసివచ్చే పార్టీలతో టీవీకే చీఫ్ విజయ్ (Vijay) సంప్రదింపులు జరుతున్నారు.
Tamil Nadu | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులో (Tamil Nadu) అతిపెద్ద పార్టీగా అవతరించి టీవీకే (TVK).. ప్రభుత్వ ఏర్పాటుకు స్పీడ్ పెంచింది. తమతో కలిసివచ్చే పార్టీలతో టీవీకే చీఫ్ విజయ్ (Vijay) సంప్రదింపులు జరుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను విజయ్ కలువనున్నారు. ఇందులోభాగంగా గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను టీవీకే కోరింది. అంతకుముందు ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అనంతరం తనకు మద్దతునిచ్చే అందరి సంతకాలను సేకరించి గవర్నర్‌కు సమర్పించనున్నట్లు తెలుస్తున్నది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే 108 స్థానాలు గెలుపొందింన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కుకు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో చిన్న పార్టీల సహాయంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, 4 చోట్ల విజయం సాధించిన పట్టలై మక్కల్ కచ్చి (PMK)తోపాటు కమ్యూనిస్టులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, పీఎంకే మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే తమకు చెరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయని తెలియవస్తున్నది. ఇక టీవీకేకు మద్దతు విషయమై కమ్యూనిస్టులు అంతర్గతంగా చర్చించుకున్నాయి.
ప్రాంతీయ పార్టీలైన విదుతళై చిరుతరైగల్ కచ్చి (VCK), దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) చివరి వరకు వేచిచూడాలని, ఆతర్వాతే ఎటువైపు ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని కలుపుకొని విజయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



