త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | అల్లు అర్జున్ కోస‌మే ఆ ప‌ని చేశా..! శ్రీ‌లీల కామెంట్స్ వైర‌ల్‌..!

Sreeleela | యంగ్ బ్యూటీ శ్రీ‌లీల గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పెళ్లిసంద‌D మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ సోయ‌గం ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్న‌ది. తెలుగుతో పాటు క‌న్న‌డ, త‌మిళం, బాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకువెళ్తున్న‌ది.

P

Movies | Published On Jan 7, 2026, 4.35 pm IST

Sreeleela | అల్లు అర్జున్ కోస‌మే ఆ ప‌ని చేశా..! శ్రీ‌లీల కామెంట్స్ వైర‌ల్‌..!
Advertisement

Sreeleela | యంగ్ బ్యూటీ శ్రీ‌లీల గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పెళ్లిసంద‌D మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ సోయ‌గం ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్న‌ది. తెలుగుతో పాటు క‌న్న‌డ, త‌మిళం, బాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకువెళ్తున్న‌ది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల ప‌రాశ‌క్తి మూవీలో న‌టిస్తున్న‌ది. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 10న విడుద‌ల కానున్న‌ది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న‌ది. ఈ క్ర‌మంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌లీల చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

శ్రీ‌లీల న‌ట‌న‌తోపాటు డ్యాన్స్ గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. హీరోల‌కు ధీటుగా స్టెప్పులు వేస్తూ డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరు సంపాదించింది. అయితే, శ్రీ‌లీల పుష్ప-2 మూవీలో ఐట‌మ్ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే. కిస్సిక్ సాంగ్‌పై స్పందిస్తూ.. సాధార‌ణంగా తాను ఐట‌మ్స్ సాంగ్స్ చేయ‌న‌ని.. కేవ‌లం అల్లు అర్జున్ కోసం మాత్ర‌మే ఎప్పుకున్నాన‌ని తెలిపింది. హీరోయిన్ పాత్ర‌లో డ్యాన్స్ చేయ‌డ‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని.. ఐట‌మ్స్ సాంగ్స్ చేయ‌డం న‌చ్చ‌ని చెప్పింది. అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబోలో వ‌చ్చిన ప్రాజెక్టులో భాగం కావ‌డం త‌న‌కు గ‌ర్వంగా అనిపించింద‌ని చెప్పింది.

పుష్ప 2లో శ్రీలీల చేసిన 'కిస్సిక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ఈ సాంగ్‌తో శ్రీ‌లీల‌కు మ‌రింత గుర్తింపును తీసుకువ‌చ్చింది. వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఉన్న శ్రీ‌లీల కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా మారింద‌నడంలో సందేహం లేదు. ఈ సంద‌ర్భంగా డ్యాన్స‌ర్ మాత్ర‌మే అన్న ఇమేజ్‌పై సైతం శ్రీ‌లీల స్పందించింది. త‌న‌ను చాలామంది బెస్ట్ డ్యాన్సర్‌గా మాత్ర‌మే చూస్తున్నార‌ని.. డ్యాన్సర్ మాత్ర‌మే కాకుండా బెస్ట్ న‌టిన‌ని పేర్కొంది. భ‌గ‌వంత్ కేస‌రి మూవీలో త‌న న‌ట‌న అంద‌రికీ తెలుసున‌ని.. ఆ పర్సెప్షన్ మార్చడం అంత తేలిక కాద‌ని చెప్పుకొచ్చింది. నటిగా మిరిన్ని వేరియేషన్స్ చూపించ‌డ‌మే త‌న ల‌క్ష్యంగా తెలిపింది.

ఇదిలా ఉండ‌గా.. శ్రీ‌లీల సినిమాల విష‌యానికి వ‌స్తే చివ‌రిసారిగా మాస్ జాత‌ర మూవీలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించింది. ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తున్న‌ది. త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ప‌రాశ‌క్తి మూవీలో న‌టిస్తున్న‌ది. ఈ మూవీ ఈ నెల 10న విడుద‌ల కానుంది. అలాగే, హిందీలో అనురాగ్ బ‌సు మూవీలోనూ హీరోయిన్‌గా క‌నిపించ‌నున్న‌ది. తెలుగులో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాన్‌కు జ‌త‌క‌ట్ట‌నున్న‌ది. హ‌రీశ్ శంక‌ర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement