త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parashakti | సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకున్న ‘పరాశక్తి’..? తెలుగులో రిలీజ్ అప్పుడే..!

Parashakti | త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న మూవీ ప‌రాశ‌క్తి. ‘పరాశక్తి’ ఈ మూవీ నెల 10న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సుధా కొంగ‌ర ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కించారు.

P

Entertainment | Published On Jan 7, 2026, 4.01 pm IST

Parashakti | సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకున్న ‘పరాశక్తి’..? తెలుగులో రిలీజ్ అప్పుడే..!
Advertisement

Parashakti | త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న మూవీ ప‌రాశ‌క్తి. ‘పరాశక్తి’ ఈ మూవీ నెల 10న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సుధా కొంగ‌ర ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కించారు. అయితే, మొద‌ట మేక‌ర్స్ ఈ మూవీని సైతం త‌మిళంతోపాటు తెలుగులో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే, తెలుగులో మాత్రం విడుద‌ల ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి 23న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా టాక్ న‌డుస్తుంది.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన తెలుగు వెర్ష‌న్‌లో ఇంకా ప్ర‌మోష‌న్స్ మాత్రం ప్రారంభించ‌లేదు. ట్రైల‌ర్ సైతం విడుద‌ల చేయ‌లేదు. దాంతో సంక్రాంతి రేసు నుంచి మూవీ త‌ప్పుకున్న‌ట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్‌లోనే ఇప్ప‌టికే భారీగా సినిమాలు రిలీజ్ కానున్న నేప‌థ్యంలో థియేట‌ర్ల కొర‌త ఎదుర‌య్యే అవ‌కాశం ఉండ‌డంతో మేక‌ర్స్ తెలుగు రిలీజ్‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, విడుద‌ల వాయిదా వేయ‌డం వ‌ల్ల సినిమాకు క‌లిసి రావ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లుగా బ‌జ్ న‌డుస్తున్న‌ది.

1960 దశకంలో తమిళనాడు సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రభావం చేసిన హిందీ భాషా వ్యతిరేకోద్యమం నేపథ్యంగా మూవీని సుధా కొంగ‌ర చిత్రీక‌రించారు. హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎం రాజేంద్రన్ జీవితంలోని కీలక సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాను తెర‌కెక్కించారు. ఈ ఉద్య‌మంలో రాజేంద్రన్ పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. సోదరభావం, ఉద్యమం, దేశభక్తి, భాషా సామరస్యం, రాజకీయ, సామాజిక అస్థిత్వం అంశాల ఆధారంగా మూవీని తెర‌కెక్కించారు. రాజేంద్ర‌న్ పాత్ర‌లో శివ‌కార్తికేయ‌న్ క‌నిపించ‌నున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తుంది. రవి మోహన్ ప్రతినాయక పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తెలుగు న‌టుడు రానా ద‌గ్గుబాటి, అధ‌ర్వా, బాసిల్ జోసఫ్ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement