త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | స‌మంత ‘మా ఇంటి బంగారం’ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది..! సంక్రాంతికి ముందే టీజ‌ర్ ట్రైల‌ర్‌..!

Samantha | ప్ర‌ముఖ హీరోయిన్ సమంత రూత్ ప్ర‌భు లీడ్‌రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైల‌ర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైల‌ర్‌ ప్రేక్షకులకు ప‌వ‌ర్‌ఫుల్‌, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌ని పేర్కొన్నారు.

P

Entertainment | Published On Jan 7, 2026, 6.02 pm IST

Samantha | స‌మంత ‘మా ఇంటి బంగారం’ ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేసింది..! సంక్రాంతికి ముందే టీజ‌ర్ ట్రైల‌ర్‌..!
Advertisement

Samantha | ప్ర‌ముఖ హీరోయిన్ సమంత రూత్ ప్ర‌భు లీడ్‌రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైల‌ర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైల‌ర్‌ ప్రేక్షకులకు ప‌వ‌ర్‌ఫుల్‌, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌ని పేర్కొన్నారు. స‌మంత‌తో ఇది వ‌ర‌కు ‘ఓ బేబి’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన నందినీ రెడ్డి.. మ‌రోసారి ‘మా ఇంటి బంగారం’ మూవీకి డైరెక్ట్ చేస్తోంది. వీరిద్ద‌రి కాంబోపై భారీ అంచ‌నాలున్నాయి. అయితే, ఈసారి మాత్రం డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌, స్టోరీతో, బోల్డ్‌గా, గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా మా ఇంటి బంగారం సినిమా ఉండబోతోందని మేకర్స్ పేర్కొంటున్నారు.

ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే స‌మంత లుక్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా, ఎఫెక్టివ్‌గా క‌నిపించి సోష‌ల్ మీడియాలో మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. ఆమె పాత్రలోని ఇంటెన్సిటీ, పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు స్ప‌ష్టంగా తెలుస్తోంది. రా, హై ఇంపాక్ట్ యాక్ష‌న్‌తో మ‌న భార‌తీయ శైలిని మిక్స్ చేసిన పాత్ర‌లో స‌మంత అల‌రించ‌నుంది. ఈ క్ర‌మంలో 9న విడుద‌ల కానున్న టీజ‌ర్ ట్రైల‌ర్‌పై అంచ‌నాలు పెరిగాయి. ఖుషి మూవీ త‌ర్వాత స‌మంత రీల్‌లో న‌టిస్తుండ‌డం విశేషం. దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథనం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను వసంత్ మారిన్‌గంటి, రాజ్ నిడిమోరు రచించగా, ప్రముఖ రచయిత సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్‌విజన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement

తాజావార్తలు

Advertisement