Samantha | అలియా భట్ బాలీవుడ్ మూవీలో సమంత స్పెషల్ సాంగ్?
పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ తర్వాత సమంత మళ్లీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలియాభట్ బాలీవుడ్ మూవీ అల్ఫాలో సమంత ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Dec 30, 2025, 2.16 pm IST
Samantha | అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. టాలీవుడ్లో బెస్ట్ స్పెషల్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఊ అంటావాతోనే కెరీర్లో ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ ఐటెంసాంగ్‌లో హాట్ హాట్‌గా కనిపించి అభిమానులకు పెద్ద షాకిచ్చింది. అప్పట్లో ఈ సాంగ్ గురించి గట్టిగానే డిస్కషన్ నడిచింది. ఊ అంటావా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో సమంతకు చాలానే ఆఫర్లు వచ్చాయి. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేశారు. కానీ స్పెషల్ సాంగ్స్ చేయడానికి సమంత అంగీకరించలేదు. ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసింది.
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత ఐటెంసాంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదీ కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో. అలియాభట్ హీరోయిన్గా అల్ఫా పేరుతో బాలీవుడ్లో ఓ స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే అల్ఫా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమోషనల్ కమ్ స్పెషల్ సాంగ్లా రెండు విధాల ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఈ పాటను షూట్ చేయనున్నారట మేకర్స్. ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సాంగ్‌ను గ్రాండియర్‌గా చిత్రీకరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాటలో సమంతతో పాటు బాలీవుడ్‌కు చెందిన మరికొందరు హీరోయిన్లు కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శుభంతో రీఎంట్రీ...
ఇటీవలే శుభం సినిమాతో దాదాపు రెండేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ హారర్ కామెడీ మూవీని స్వయంగా సమంతనే నిర్మించింది. నిర్మాతగా తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ అందుకుంది. శుభం మూవీలో అతిథి పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం మా ఇంటి బంగారం షూటింగ్‌తో బిజీగా ఉంది సమంత. ఈ క్రైమ్ కామెడీ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బేబీ, జబర్ధస్థ్ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తోంది.
సంబంధిత వార్తలు

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు – రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
నవంబర్ 28, 2026

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత – కమ్‌బ్యాక్ అప్పుడేనా?
నవంబర్ 28, 2026

Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు – కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి



