త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naa Anveshana Anvesh | నా అన్వేష‌ణ అన్వేష్‌పై పెరుగుతున్న ఆగ్ర‌హం.. రంగంలోకి క‌రాటే కల్యాణి..

Naa Anveshana Anvesh | ప్ర‌పంచ యాత్రికుడి పేరిట యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా వీడియోలు చేస్తున్న అన్వేష్ ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకుపోయాడు. ఇటీవ‌ల ఓ వీడియోలో అత‌ను చేసిన కామెంట్ల‌కు హిందూ సంఘాలు, మ‌హిళ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

S

Entertainment | Published On Dec 31, 2025, 12.40 pm IST

Naa Anveshana Anvesh | నా అన్వేష‌ణ అన్వేష్‌పై పెరుగుతున్న ఆగ్ర‌హం.. రంగంలోకి క‌రాటే కల్యాణి..
Advertisement

Naa Anveshana Anvesh | ప్ర‌పంచ యాత్రికుడి పేరిట యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా వీడియోలు చేస్తున్న అన్వేష్ ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకుపోయాడు. ఇటీవ‌ల ఓ వీడియోలో అత‌ను చేసిన కామెంట్ల‌కు హిందూ సంఘాలు, మ‌హిళ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ దేవ‌త‌ల‌ను దూషించ‌డంతోపాటు మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచేలా అన్వేష్ అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశాడ‌ని ఆరోపిస్తూ ఇప్ప‌టికే అత‌నిపై ప‌లు చోట్ల ఫిర్యాదులు చేశారు. ఖ‌మ్మం జిల్లా దాన‌వాయి గూడెం గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి అన్వేష్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, తాజాగా న‌టి, బీజేపీ నాయ‌కురాలు క‌రాటే కల్యాణి అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అటు ఖ‌మ్మం అర్బ‌న్ పోలీసులు, ఇటు పంజాగుట్ట పోలీసులు అత‌నిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో..

పంజాగుట్ట పోలీసులు అన్వేష్‌పై 352, 79, 299 బీఎన్ఎస్ సెక్ష‌న్ 67ఐటీ యాక్ట్‌ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే పంజాగుట్ట పోలీసులు అన్వేష్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాగా అన్వేష్ చేసిన వ్యాఖ్య‌లు సామాజిక భావోద్వేగాల‌ను దెబ్బ తీసేలా ఉన్నాయ‌ని పేర్కొంటూ పోలీసులు ఆ కోణంలో కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుల‌పై పూర్తి వివ‌రాల‌ను సేక‌రించి విచార‌ణ జ‌రిపిన అనంత‌రం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివ‌రించారు. కాగా అంత‌కు ముందు అన్వేష్ న‌టుడు శివాజీపై కూడా వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. న‌టుడు శివాజీ దండోరా అనే మూవీకి సంబంధించి నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై వ్యాఖ్య‌లు చేయ‌గా ఆయ‌న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి. దానిపై అన‌సూయ‌, నాగ‌బాబుతోపాటు ప‌లువురు సెల‌బ్రిటీలు స్పందించి త‌ప్పుబ‌ట్టారు.

వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మార‌డంతో శివాజీ తాను అన్న వాక్యాల్లోని కొన్ని ప‌దాల‌కు మాత్ర‌మే క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని, వాటి అర్థానికి తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఎదుట హాజ‌రై త‌న వ్యాఖ్య‌ల‌కు వివ‌రణ కూడా ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ రోజు రోజుకీ ఈ వివాదం ముదురుతూనే ఉంది. అయితే నా అన్వేష‌ణ అన్వేష్ న‌టుడు శివాజీతోపాటు మ‌హిళ‌ల‌పై, హిందూ దేవ‌త‌ల‌పై కూడా కామెంట్లు చేశాడు. దీంతో స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్నాడు. అయితే ఈ వివాదం ఇంకా ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement