Anasuya | స్విమ్ సూట్‌లో అనసూయ – శివాజీపై కోపంతోనే పోస్ట్ చేసిందంటున్న నెటిజన్లు!
శివాజీ, అనసూయ మధ్య గత రెండు రోజులుగా నడుస్తున్న వివాదానికి ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. స్విమ్ సూట్ లో గ్లామరస్‌గా కనిపిస్తున్న తన పాత వీడియోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. శివాజీపై కోపంతోనే ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు.
Entertainment | Published On Dec 26, 2025, 4.28 pm IST
Aanasuya
Anasuya | హీరోయిన్ల డ్రెస్‌లపై యాక్టర్ శివాజీ చేసిన కామెంట్లు గత రెండు రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం కాస్త శివాజీ, అనసూయ మధ్య గొడవగా మారింది. శివాజీ కామెంట్లపై తొలుత అనసూయ ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో బదులిచ్చింది. మీ రుణం తీర్చుకునే అవకాశం రావాలంటూ శివాజీ కౌంటర్ ఇవ్వడంతో అనసూయ అతడిపై గట్టిగానే ఫైర్ అయ్యింది. ఎలాంటి డ్రెస్‌లు ధరించాలో మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని, మా హక్కుల గురించి మాకు తెలుసునంటూ శివాజీపై విరుచుకుపడింది. అతడితో ఆగకుండా గురువారం సోషల్ మీడియాలో శివాజీకి వ్యతిరేకంగా చాలానే పోస్ట్‌లు పెట్టింది. అనసూయ పోస్ట్‌లపై చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తుండగా...కొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌కు ధీటుగానే బదులిచ్చింది అనసూయ.
స్విమ్ సూట్‌లో...
ఈ వివాదంపై శివాజీ సైలెంట్ అయిపోయినా అనసూయ మాత్రం తగ్గడం లేదు. తాజాగా స్విమ్ సూట్‌లో అందాలను ఒలకబోస్తున్న తన పాత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో స్విమ్‌సూట్ ధరించి స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతూ అనసూయ కనిపించింది. గతంలో అనసూయ యూరప్ ట్రిప్‌కు వెళ్లినప్పటి వీడియో ఇది. ట్రావెల్ డేస్‌ను మిస్సవుతున్నానని, త్వరలోనే ఓ ట్రిప్ ప్లాన్ చేయాలంటూ ఈ వీడియోను ఉద్దేశించి కామెంట్ పెట్టింది అనసూయ. శివాజీతో కాంట్రవర్సీ జరుగుతోన్న టైమ్‌లో అనసూయ స్విమ్ సూట్ వీడియో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హండ్రెస్ పర్సెంట్ కరెక్ట్...
నిండైన బట్టల్లోనే హీరోయిన్ల అందం దాగి ఉంటుందని శివాజీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై కోపంతోనే అనసూయ ఈ వీడియోను పోస్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే అనసూయ వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తుందని అంటున్నారు. నువ్వు ఇక మారవా అంటూ ట్రోల్ చేస్తున్నారు. శివాజీ చెప్పింది వంద శాతం నిజం అంటూ చాలా మంది నెటిజన్లు అనసూయ పోస్ట్‌ను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు.
శివాజీ హీరోగా నటించిన దండోరా మూవీ గురువారం రిలీజైంది. పాజిటివ్ టాక్ వచ్చినా తొలిరోజు ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. శివాజీ కామెంట్లు ఇందుకు కారణమంటూ ప్రచారం జరుగుతోంది. తన వ్యక్తిగత వివాదాన్ని పక్కనపెట్టి ఈ సినిమాను ఆదరించాలంటూ శివాజీ కోరారు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Tollywood | టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న పర్సంటేజీ వివాదం – కోలీవుడ్‌లోనూ ఒక రోజు స్ట్రైక్
మే 2, 2026

Getup Srinu | మేము కాపులం పేరుతో నాగబాబు వెబ్‌సిరీస్ – జర్నలిస్ట్ జాఫర్‌పై గెటప్ శ్రీను ఫైర్
మే 1, 2026

Naa Anveshana Anvesh | నా అన్వేషణ అన్వేష్‌పై పెరుగుతున్న ఆగ్రహం.. రంగంలోకి కరాటే కల్యాణి..
డిసెంబర్ 31, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



