Anasuya | నన్ను “ఆంటీ” అంటున్నారు – శివాజీని “గారు” అని పిలుస్తున్నారు – అనసూయ పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో కొందరు తన వయసును అవహేళన చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారంటూ అనసూయ ఫైర్ అయ్యింది. నలభై ఏళ్లు ఉన్న తనను ఆంటీ అని పిలుస్తూ యాభై నాలుగేళ్ల శివాజీకి మాత్రం గారు అంటూ గౌరవం ఇస్తున్నారని ఓ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Dec 25, 2025, 3.50 pm IST
శివాజీ
Anasuya |దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ చేసిన కామెంట్లు టాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. శివాజీ వ్యాఖ్యలను టాలీవుడ్ సెలిబ్రిటీస్ మొత్తం తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి యాంకర్ అనసూయ, శివాజీ మధ్య గొడవగా మారింది. అనసూయ రుణం తీర్చుకునే అవకాశం త్వరలోనే రావాలంటూ బుధవారం జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో శివాజీ వ్యాఖ్యానించారు. శివాజీకి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది అనసూయ. గురువారం ఉదయం నుంచి నాలుగైదు పోస్ట్‌లు పెట్టింది. ఈ పోస్టుల్లో ఏ విషయంలోనైనా నా అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తానని అనసూయ అన్నది. ఏం జరిగినా తాను వెనక్కి తగ్గనని చెప్పింది. ఈ కాలంలో డ్రెస్‌ల గురించి మాట్లాడటం నిజంగా చేతకానీతనమని అసనూయ పేర్కొన్నది. తాను హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినట్లు చెప్పిన అనసూయ తాము ఎలాంటి దుస్తులు ధరించాలో మీరు చెప్పాల్సిన పనిలేదంటూ శివాజీపై ఫైర్ అయ్యింది. అనసూయ చేసిన కామెంట్స్, పోస్ట్‌లను ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె వయసును పేర్కొంటూ వెకిలి కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌కు అనసూయ ధీటుగానే బదులిచ్చింది.
"జరుగుతున్న ఇష్యూ పట్ల ఎలా రియాక్ట్ కావాలో తెలియక కొందరు నా వయసు గురించి అవహేళన చేస్తున్నారు. నన్ను ఆంటీ అని పిలుస్తూ శివాజీకి మాత్రం గారు అని రెస్పెక్ట్ ఇస్తున్నారు. నా వయసు నలభై అయితే ఆయన వయసు యాభై నాలుగు అనుకుంటా. మా ప్రొఫెషన్ కోసం ఇద్దరం పర్సనల్‌గా గ్లామర్, ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్నాం. ఆంటీ అని పిలచేవాళ్లందరూ నిత్య యవ్వనులు. అది వేరే విషయం అనుకొండి. ఇంత కంటే ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే" అంటూ అనసూయ ఓ ట్వీట్ చేసింది. అనసూయ పోస్ట్ వైరల్‌గా మారింది. అనసూయ పోస్ట్‌లకు శివాజీ రియాక్ట్ అవుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ గొడకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా లేదని కామెంట్స్ పెడుతున్నారు.
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు అందం చీర కట్టులో ఉంటుంది కానీ సామాన్లు కనిపించే డ్రెసుల్లో ఉండదంటూ శివాజీ చేసిన కామెంట్స్‌తోనే ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత రోజు శివాజీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



