Actor Shivaji | శివాజీని వీడని వివాదం – మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌లపై చేసిన కామెంట్లకు సంబంధించి యాక్టర్ శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో అనుకోకుండా రెండు తప్పుడు మాటలు దొర్లినట్లు శివాజీ చెప్పినట్లు సమాచారం. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని మాటిచ్చినట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Dec 27, 2025, 1.38 pm IST
శివాజీ
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్‌లపై సీనియర్ యాక్టర్ శివాజీ (Actor Shivaji) చేసిన కామెంట్లు టాలీవుడ్‌లో (Tollywood) పెద్ద దుమారాన్నే రేపాయి. ఇటీవల జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీరలో నిండుగా ఉంటేనే అందంగా ఉంటూరంటా హీరోయిన్లకు సలహా ఇవ్వబోయి కొన్ని బూతులు మాట్లాడారు శివాజీ. అనాలోచితంగా శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయితో పాటు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ కామెంట్లను సుమోటోగా తీసుకున్న మహిళా కమీషన్ అతడికి నోటీసులు పంపించింది. నోటీసులకు సంబంధించి శనివారం ఉదయం మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
మరోసారి క్షమాపణలు...
అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి శివాజీ స్టేట్‌మెంట్‌ను మహిళా కమిషన్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఎవరిని నొప్పించకుండా మంచి ఉద్దేశంతోనే తాను సలహా ఇవ్వబోయానని, అనుకోకుండా రెండు తప్పుడు మాటలు దొర్లాయని మహిళా కమిషన్ సభ్యులకు శివాజీ చెప్పినట్లు తెలిసింది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తన వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి మహిళా కమిషన్ సభ్యుల ఎదుట కూడా శివాజీ క్షమాపణలు చెప్పాడని అంటున్నారు. విచారణ అనంతరం శివాజీ ఏం మాట్లాడుతాడన్నది ఆసక్తికరంగా మారింది.
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల అందం నిండైన డ్రెస్సుల్లోనే ఉంటుంది కానీ సామాన్లు కనిపించే వాటిలో ఉండదంటూ శివాజీ కామెంట్స్ చేశారు. హీరోయిన్లను దరిద్రపు...అంటూ అసభ్యకరమైన భాష వాడాడు. అతడి కామెంట్లకు అనసూయ గట్టిగానే బదులిచ్చింది. మీ సలహాలు తీసుకునే స్థాయిలో మేము లేమంటూ చెప్పింది. నీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకుంటున్నానంటూ అనసూయకు శివాజీ కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం కాస్త పెద్దదైంది. . శివాజీ కామెంట్లను టాలీవుడ్ సెలిబ్రిటీలు తప్పుపడుతుండగా... నెటిజన్లు మాత్రం అతడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. శివాజీ వ్యాఖ్యలు ప్రభావం అతడి కొత్త సినిమా దండోరాపై పడినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే యాభై లక్షల లోపే కలెక్షన్స్ రాబట్టింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



