New Year Eve | డిసెంబర్ 31 నాడు ఫుల్లుగా తాగండి.. పోలీసులే మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తారు!
బెంగళూరుతో పాటు రాష్ట్రంలో 15 ప్రాంతాల్లో డ్రాప్ ఫెసిలిటీని పోలీసులు నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు అన్ని ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. బార్లు, పబ్బుల దగ్గర కూడా పోలీసులు కఠిన రూల్స్ పెట్టారు.
New Year Eve | ఇంకా కొన్ని గంటలే. 2025 కి స్వస్తి పలికి 2026 లోకి అడుగు పెట్టబోతున్నాం. 2026 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలను చేసుకునేందుకు చాలా మంది ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటారు. కొందరు ఫుల్లుగా మద్యం సేవిస్తారు. కొందరు ఫుడ్ తింటారు. కొందరు కేకులు కట్ చేస్తుంటారు. కొందరు ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్తారు. ఇలా కొత్త సంవత్సరాన్ని పలు రకాలుగా జరుపుకుంటారు. అయితే.. ఎక్కువ మంది డిసెంబర్ 31 నాడు తాగడానికే ఇష్టపడతారట. అందుకే ఆ రోజు రోడ్ల మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు కూడా కఠినమైన ట్రాఫిక్ రూల్స్‌ని తీసుకొచ్చారు.
ఈనేపథ్యంలో ఫుల్లుగా తాగి వాహనాలను డ్రైవ్ చేయకుండా ఉండేందుకు, కర్ణాటక ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా బెస్ట్ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర ఏమంటున్నారంటే.. కొత్త సంవత్సరం వేడుకలను బేషరతుగా జరుపుకోండి. ఫుల్లుగా తాగండి. అసలు నడవడానికి కూడా ఓపిక లేనంతగా తాగండి. అలా తాగిన తర్వాత మాత్రం వాహనాలను నడపకండి. మీ కోసమే పోలీసులు డ్రాప్ ఎట్ హోమ్ ఆప్షన్‌ని తీసుకొచ్చారు. మిమ్మల్ని జాగ్రత్తగా మీ ఇంటి వద్ద దిగబెడతారు.. అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ బంపర్ ఆఫర్ అందరికీ కాదు.. అన్ని ప్రాంతాల్లో కాదు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపి ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలనే కర్ణాటక ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుంది. బెంగళూరు, మైసూరు, హుబ్లీ, బెలగావి, మంగళూరు లాంటి 15 నగరాల్లో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు.
బెంగళూరులో డ్రాప్ ఫెసిలిటీ
బెంగళూరులో డ్రాప్ ఫెసిలిటీని బెంగళూరు పోలీసులు ప్రారంభించారు. డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా తాగిన వాళ్లను తమ ఇంటి వద్ద పోలీసులే డ్రాప్ చేస్తారు. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇటువంటి సమయంలో మహిళ భద్రత కీలకం కాబట్టి వాళ్ల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
బెంగళూరుతో పాటు రాష్ట్రంలో 15 ప్రాంతాల్లో డ్రాప్ ఫెసిలిటీని పోలీసులు నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు అన్ని ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. బార్లు, పబ్బుల దగ్గర కూడా పోలీసులు కఠిన రూల్స్ పెట్టారు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | జగ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..
- ●Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్రయత్నాన్ని అభినందించండి.. కేంద్రం సన్న బియ్యానికి ఖర్చు భరిస్తే మోదీ ఫొటో పెడతాం
- ●Y chromosome Disappearing | భవిష్యత్తులో మగవాళ్లు ఉండరా? 'Y క్రోమోజోమ్' మాయమవుతోందా? దాని క్షీణత వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
- ●OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
- ●Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని

CM Revanth Reddy | జగ్గారెడ్డి పిచ్చోడిలా తిరుగుతుండు : సీఎం రేవంత్ రెడ్డి

Itel | గృహోపకరణాల రంగంలోకి ఐటెల్.. చవక ధరలకే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు..

Uttamkumar Reddy | స్మార్ట్ కార్డుల ప్రయత్నాన్ని అభినందించండి.. కేంద్రం సన్న బియ్యానికి ఖర్చు భరిస్తే మోదీ ఫొటో పెడతాం

Y chromosome Disappearing | భవిష్యత్తులో మగవాళ్లు ఉండరా? 'Y క్రోమోజోమ్' మాయమవుతోందా? దాని క్షీణత వెనుక ఉన్న సైన్స్ ఏంటి?






