త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS NRI USA | కాళేశ్వ‌రం తెలంగాణ‌కు ప్రాణేశ్వ‌రం.. హైకోర్టు తీర్పుతో ధ‌ర్మం గెలిచింది: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ

BRS NRI USA | కాళేశ్వ‌రం కేసులో హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింద‌ని అమెరికాలోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శ్రేణులు (BRS NRI USA) వ్యక్తం చేశాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా, న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మమే జయిస్తుందని, సత్యమే నినదిస్తుందని మరోసారి నిరూపితమైంద‌న్నారు.

G

Telangana | Published On Apr 23, 2026, 9.43 am IST

BRS NRI USA | కాళేశ్వ‌రం తెలంగాణ‌కు ప్రాణేశ్వ‌రం.. హైకోర్టు తీర్పుతో ధ‌ర్మం గెలిచింది: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ
Advertisement

BRS NRI USA | త్రినేత్ర‌.న్యూస్‌: కాళేశ్వ‌రం కేసులో (Kaleshwaram Project) హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింద‌ని అమెరికాలోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శ్రేణులు (BRS NRI USA) వ్యక్తం చేశాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా, న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మమే జయిస్తుందని, సత్యమే నినదిస్తుందని మరోసారి నిరూపితమైంద‌న్నారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింద‌ని చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింద‌న్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయ‌న్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైంద‌ని విమ‌ర్శించారు. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి, వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.

కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం

కూలింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్ మీద కాంగ్రెస్ చేసిన కుట్రలు, అబద్ధాలు, మోసపూరిత గారడీలు చేసింద‌న్నారు. హైకోర్టు తీర్పుతో నిజం నిరూపితమై, కాలర్ ఎగరేసి నిటారుగా నిలబడింద‌ని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రేవంత్ ప్రభుత్వ కుట్రలు భగ్నమయ్యాయ‌ని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అసంబద్ధమని తేల్చిన హైకోర్టు, ఆ నివేదికను నిలిపివేసింద‌న్నారు. ఎవరు ఔనన్నా, కాదన్నా.. ముమ్మాటికీ తెలంగాణ జీవాధారం కాళేశ్వరమేన‌ని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు..

తెలంగాణ రైతు కన్నీటి చరిత్రకు ముగింపు పలికిన మహత్తర యజ్ఞం. గోదావరి జలాలను ఎత్తి ఎండిన భూములను పచ్చని పంటలతో కళకళలాడించిన జీవనాడి కాళేశ్వరం. వర్షాధార వ్యవసాయం నుంచి నీటి భద్రతతో కూడిన వ్యవసాయానికి తెలంగాణను తీసుకెళ్లిన మార్గదర్శి ప్రాజెక్ట్ ఇది. ఎండలతో కాలిపోయిన నేలలకు చల్లని నీరు అందించి లక్షల ఎకరాలకు పంటల భరోసా కల్పించింది కాళేశ్వరం. రైతు బావి ఎండిపోతే కూడా కాళేశ్వరం నీరు అతని ఆశలను ఎండిపోనివ్వలేదు.

అభివృద్ధి చక్రం..

కాళేశ్వ‌రం ప్రాజెక్టు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన అభివృద్ధి చక్రం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెంచి, వలసలను తగ్గించిన ప్రజల ప్రాణాధారం. ప్రతి చుక్క నీరు వెనుక ఒక రైతు చిరునవ్వు ఉంది. ఆ చిరునవ్వుకే కాళేశ్వరం ప్రతీక. తెలంగాణ భవిష్యత్తుకు నీటి భద్రత కల్పించిన విజన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం.

ఎవరు ఎంత విమర్శించినా..

కాళేశ్వరం నీరు మాట్లాడుతుంది, పంటలు మాట్లాడుతాయి, రైతు సంతోషం మాట్లాడుతుంది. అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, లూవిల్లే, చికాగో, లాస్ ఏంజిల్స్, బే ఏరియా, డెట్రాయిట్, షార్లెట్, అలబామా నగరాలలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ డివిజన్ సమావేశమై, హైకోర్టు తీర్పుపై తమ సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement