Heat Wave | అట్టుడుకుతున్న తెలంగాణ.. మరో వారం రోజులు మండుటెండలే..!
Heat Wave | ఈ ఏడాది ఎండలు తెలంగాణను అట్టుడికిస్తున్నాయి. గత ఐదేళ్లలోని రికార్డులను చెరిపేస్తూ పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై స్థానిక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : ఈ ఏడాది ఎండలు తెలంగాణను అట్టుడికిస్తున్నాయి. గత ఐదేళ్లలోని రికార్డులను చెరిపేస్తూ పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై స్థానిక ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వారం రోజుల కంటే పైబడి నమోదు కావడం కూడా ఆందోళన కలిగించింది. వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగానే కొనసాగింది. వడగాల్పులకు జనాలు పిట్టల్లా రాలిపోయారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అయితే నేటి నుంచి వానాకాలం ప్రారంభం కానున్నప్పటికీ నైరుతి రుతుపవనాలు మాత్రం రాష్ట్రాన్ని తాకలేదు. మరో పది రోజుల తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరో వారం రోజుల పాటు మండుటెండల తీవ్రత కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాతనే వాతావరణం చల్లబడే అవకాశం ఉందన్నారు.
ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మంగళ, బుధ, గురువారాల్లో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలో..
ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మరో 29 జిల్లాల్లో 40.1 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జోగులాంబ గద్వాల, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో 39.6 నుంచి 39.8 డిగ్రీలు నమోదయ్యాయి. ములుగు జిల్లా వాజేడు, మంగపేట, ఏటూరు నాగారం మండలాల్లో వడగాలులు ఎక్కువగా నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్





